Robin Uthappa Kohli : అత‌డో దిగ్గ‌జం ఎలా ఆడాలో చెప్ప‌లేం

రాబిన్ ఊత‌ప్ప సంచ‌ల‌న కామెంట్స్

Robin Uthappa Kohli : భార‌త క్రికెట్ జ‌ట్టులో సుదీర్ఘ కాలం పాటు ఆడుతూ త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ ని స్వంతం చేసుకున్న ఏకైక క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ.

ఎన్నో విజ‌యాలు అందించిన, అనేక రికార్డులు బ‌ద్ద‌లు కొట్టి తానే ఓ రికార్డ్ గా మారి పోయిన ఈ క్రికెట‌ర్ ఇప్పుడు ప‌రుగులు చేసేందుకు నానా తంటాలు ప‌డుతున్నాడు.

ట‌న్నుల కొద్దీ ర‌న్స్ చేస్తూ రికార్డులు క్రియేట్ చేసిన స‌ద‌రు క్రికెట‌ర్ డిఫెన్స్ ఆడేందుకు ట్రై చేయ‌డం విస్తు పోయేలా చేస్తోంది. దీంతో ఇక కోహ్లీ ప‌నై పోయింద‌ని అత‌డిని త‌ప్పిస్తే బెట‌ర్ అంటూ తాజా, మాజీ ఆట‌గాళ్లు గ‌గ్గోలు పెడుతున్నారు.

ప్ర‌ధానంగా భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ అయితే వెంట‌నే తొల‌గించి కొత్త ఆట‌గాళ్ల‌కు చాన్స్ ఇవ్వాల‌ని కోరాడు. దీంతో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి.

క‌ర్ణాట‌క‌కు చెందిన స్టార్ హిట్ట‌ర్ గా పేరొందిన రాబిన్ ఊత‌ప్ప విరాట్ కోహ్లీపై(Robin Uthappa Kohli)  స్పందించాడు. అత‌డో లివింగ్ లెజెండ్ అని ఆయ‌న‌కు ఎలా ఆడాలో తానే కాదు ఎవ‌రూ చెప్ప‌లేమ‌న్నాడు.

త‌న మానాన తన‌ను ఆడేందుకు వ‌దిలి వేస్తే బాగుంటుంద‌ని సూచించాడు. త‌ను క‌చ్చితంగా తిరిగి ఫామ్ లోకి వ‌స్తాడ‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నాడు ఊత‌ప్ప‌. ప్ర‌పంచంలోని ప్ర‌తి ఒక్క క్రికెట‌ర్ ఇలాంటి స్థితిని ఎదుర్కొంటాడ‌ని ఏదో ఒక‌రోజు.

దీనిని సీరియ‌స్ గా తీసుకుంటే తానేమీ చెప్ప‌లేన‌న్నాడు. కోహ్లీ వంద‌ల కొద్దీ ప‌రుగులు చేసిన‌ప్పుడు ఎవ‌రూ మాట్లాడ‌లేద‌ని కానీ ఇప్పుడు కామెంట్స్ చేయ‌డం బాగోలేద‌న్నాడు ఊత‌ప్ప‌.

Also Read : మెన్స్ క్రికెట్ క‌మిటీలో వీవీఎస్..వెటోరీ

Leave A Reply

Your Email Id will not be published!