Robotic Rath Yatra : ‘రోబోటిక్’ ర‌థ‌యాత్ర హ‌ల్ చ‌ల్

సైన్స్, సంప్ర‌దాయాల స‌మ్మేళనం

Robotic Rath Yatra : రోజులు మారుతున్నాయి. త‌రాలు మారుతున్నాయి. అభిరుచులు, అభిప్రాయాలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భార‌త దేశంలో అతి పెద్ద పండుగ‌గా ప్ర‌తి ఏటా జూన్ 30 నుంచి జూలై 1వ తేదీ వ‌ర‌కు ఘ‌నంగా, అంగ‌రంగ వైభ‌వోపేతంగా నిర్వ‌హిస్తారు పూరీలోని జ‌గ‌న్నాథ రథ‌యాత్ర‌ను.

ఈ సంద‌ర్భంగా వేలాది మంది త‌ర‌లి వ‌చ్చారు తండోప తండాలుగా. ర‌థ యాత్ర అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రిగింది. భ‌క్తుల నినాదాల‌తో ఆ ప్రాంతం ద‌ద్ద‌రిల్లింది.

అయితే జ‌గ‌న్నాథుడిని కొలిచే వారంతా భార‌త్ లోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్నారు. వారంతా ఇక్క‌డికి విచ్చేశారు. పూరి ప్రాంత‌మంతా భ‌క్త జ‌న‌సందోహంతో నిండి పోయింది.

అయితే జ‌గ‌న్నాథుడంటే విష్ణువుకు ప్ర‌తిరూపం శ్రీ‌హ‌రి. జ‌గ‌న్నాథుడు, సోద‌రుడు బ‌ల‌భ‌ద్ర‌, సోద‌రి సుభ‌ద్ర‌ను గుర్తుకు తెచ్చుకుంటూ ర‌థ‌యాత్ర‌ను నిర్వ‌హించ‌డం ప‌రిపాటిగా, అనాది నుంచి వ‌స్తోంది.

ఈ త‌రుణంలో ఇటీవ‌ల రోబోల సంద‌డి ఎక్కువైంది. మ‌నుషులు లేకుండానే వాటితో ప‌నులు చేయ‌డం చూస్తూనే ఉన్నాం. రిమోట్ కంట్రోల్ సాయంతో అవి న‌డుస్తున్నాయి.

అమెరికాలో అయితే ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఈ కామ‌ర్స్ దిగ్గ‌జంగా పేరొందిన అమెజాన్ సైతం రోబోలను వాడుతోంది.

తాజాగా జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌కు నివాళిగా ఫోన్ బ్లూ టూత్ ద్వారా న‌డిచేలా త‌యారు చేశాడు గుజ‌రాత్ లోని వ‌డోద‌ర‌కు చెందిన జై. జై మ‌క్వానా జ‌గ‌న్నాథునికి రోబోటిక్(Robotic Rath Yatra) నివాళి అంటూ పేర్కొన్నారు.

ఇది సైన్స్ , సంప్ర‌దాయాల స‌మ్మేళ‌నం అని పేర్కొన్నారు. ఈ రోబోటిక్ ర‌థ యాత్ర అనేది రోబోటిక్ ర‌థంపై భ‌క్తుల ముందు ప్ర‌త్య‌క్షం అయ్యే దేవుడి పండ‌గ అన్నారు.

Also Read : శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీఎస్ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!