Roger Binny : బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ..?
బాస్ రేసు నుంచి గంగూలీ అవుట్
Roger Binny : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఈనెల 18న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది చివరిలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కు సంబంధించి ఎన్నికలు జరుగుతాయి.
ఇప్పటికే బీసీసీఐ కార్యవర్గం ఎన్నిక కాల పరిమితి ముగిసింది. దీంతో ఇప్పటికే బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్న సౌరవ్ గంగూలీ ఐసీసీ చైర్మన్ రేసులో ఉన్నారు.
బీసీసీఐ నుంచి తప్పుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే కీలక సమావేశం జరిగినట్లు టాక్. ఇందులో జై షా తిరిగి కార్యదర్శిగా మళ్లీ పోటీ చేయనున్నారు. ఇదిలా ఉండగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా ఇప్పటికే కొలువుతీరి ఉన్నారు. అయితే సౌరవ్ గంగూలీ తర్వాత బీసీసీఐ బాస్ గా ఎవరు ఉంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
విశ్వసనీయ సమాచారం మేరకు ఒకప్పటి భారత క్రికెట్ జట్టు మాజీ బౌలర్ రోజర్ బిన్నీ (Roger Binny) ఎన్నిక కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. భారత దేశంలోని క్రీడా రంగంలో అత్యంత జనాదరణ కలిగిన క్రీడా సంస్థగా బీసీసీఐకి పేరుంది. వరల్డ్ వైడ్ గా చూస్తే టాప్ అత్యధిక ఆదాయం కలిగిన క్రీడా సంస్థల్లో టాప్ త్రీలో బీసీసీఐ ఒకటిగా నిలిచింది.
బీసీసీఐ మార్కెట్ విలువ ప్రస్తుతం లక్ష కోట్లకు దగ్గరగా చేరింది. 1983లో ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాలో రోజర్ బిన్నీ సభ్యుడిగా ఉన్నాడు. బిన్నీ గతంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు. దీంతో బీసీసీఐ బాస్ గా బిన్నీ కార్యదర్శిగా జై షా కొనసాగాలని భావిస్తున్నారు.
అయితే కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) ప్రతినిధిగా సంతోష్ మీనన్ కు బదులుగా బిన్నీ పేరు చేర్చింది.
Also Read : పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి