Roger Binny : బీసీసీఐ బాస్ గా రోజర్ బిన్నీ
కార్యదర్శిగా జే షా ఎన్నిక
Roger Binny : అంతా అనుకున్నట్టే జరిగింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ( బీసీసీఐ) 36వ అధ్యక్షుడిగా భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్ రోజర్ బిన్నీ ఎన్నికయ్యారు. ప్రపంచంలోనే టాప్ ఆదాయం కలిగిన క్రీడా సంస్థల్లో బీసీసీఐ ఒకటి. లక్ష కోట్ల ఆదాయం కలిగిన సంస్థ భారత్ లో ఇదొక్కటే కావడం విశేషం.
ఇప్పటి వరకు 35వ బాస్ గా ఉన్న భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నిష్క్రమించారు. ఆయన ఈ పదవిలో మూడు సంవత్సరాల పాటు కొనసాగారు. తనదైన ముద్ర వేశారు. దేశంలోని 30 క్రీడా సంఘాల ప్రతినిధులు ముంబైలో జరిగిన బీసీసీఐ సర్వ సభ్య సమావేశానికి హాజరయ్యారు.
వీరంతా ఏకగ్రీవంగా రోజర్ బిన్నీని(Roger Binny) ఎన్నుకున్నారు. ఇక ఎప్పటి లాగే బీసీసీఐలో చక్రం తిప్పుతున్న కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా కొడుకు జే షా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆయన కూడా మూడేళ్ల పాటు ఉంటారు. ఇక రోజర్ బిన్నీ 1983 లో కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు వరల్డ్ కప్ గెల్చుకున్న దానిలో కీలక పాత్ర పోషించాడు రోజర్ బిన్నీ.
ఆయన కర్ణాటకకు చెందిన వారు. ఇదిలా ఉండగా మరోసారి బీసీసీఐ బాస్ గా ఉండాలని అనుకున్నారు గంగూలీ. కానీ ఆయన ఆటలు సాగనీయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిని తరుణ్ ధుమాల్ ఖండించారు కూడా. రాజకీయాల కారణంగానే గంగూలీకి ఛాన్స్ రాలేదన్న విమర్శలు లేక పోలేదు.
ఇక బిన్నీ వయస్సు 67 ఏళ్లు. బిన్నీ ఎన్నికైన విషయాన్ని వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా వెల్లడించారు మీడియాకు. బిసీసీఐ యుఎస్ 2 బిలియన్ల నికర విలువ కలిగి ఉంది.
Also Read : ఆ నాలుగు జట్లు సెమీస్ కు ఖాయం