Roger Binny Afridi : టీమిండియాకు ఐసీసీ స‌పోర్ట్ అబ‌ద్దం

షాహిది అఫ్రిదీపై రోజ‌ర్ బిన్నీ ఆగ్ర‌హం

Roger Binny Afridi : పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ షాహిది అఫ్రిది(Afridi) భార‌త జ‌ట్టుపై చేసిన ఆరోప‌ణ‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. టీమిండియాను సెమీస్ కు ఆడించాల‌ని ఐసీసీ ప్ర‌య‌త్నాలు చేసిందంటూ కామెంట్ చేశాడు. క్రికెట్ వ‌ర్గాల్లో క‌ల‌కలం రేపుతున్నాయి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు. ఇత‌ర జ‌ట్ల‌కు ఒక లాగా భార‌త జ‌ట్టు విష‌యంలో అంపైర్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆరోపించారు.

కేవ‌లం భార‌త్ ను సెమీస్ కోస‌మే ఇలా చేశారంటూ మండిప‌డ్డారు అఫ్రిదీ. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌రిపించాల‌ని కోరారు. మ‌రో వైపు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా ఐసీసీకి ఫిర్యాదు చేస్తాన‌ని పేర్కొంది. దీనిపై భార‌త జ‌ట్టు ఎలాంటి కామెంట్స్ చేయ‌లేదు.

ఈ త‌రుణంలో అఫ్రిదీ చేసిన కామెంట్స్ అర్థ‌ర‌హిత‌మ‌ని దీనికి ఏమైనా ఆధారాలు ఉంటే చూపించాల‌ని డిమాండ్ చేశారు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు చీఫ్ రోజ‌ర్ బిన్నీ(Roger Binny). ఇలాంటి చౌక‌బారు విమ‌ర్శలు చేయ‌డం మానుకోవాల‌ని సూచించారు. పూర్తిగా ఖండిస్తున్న‌ట్లు పేర్కొన్నారు బీసీసీఐ బాస్.

భార‌త జ‌ట్టుపై నోరు పారేసుకోవ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని హిత‌వు ప‌లికారు. టీమిండియాకు ఐసీసీ స‌పోర్ట్ చేయాల్సిన అవ‌స‌రం లేనే లేద‌న్నాడు. అలా అయితే ఎన్నో టోర్నీలను తాము గెలిచి ఉండే వార‌మ‌ని పేర్కొన్నాడు. ఇందుకు ఇటీవ‌ల దుబాయ్ లో జ‌రిగిన ఆసియా క‌ప్ ఉదాహ‌ర‌ణ అని తెలిపారు బిన్నీ.

ఐసీసీకి ప‌క్ష‌పాతం వ‌హించాల్సిన అవ‌స‌రం లేద‌ని, అన్ని జ‌ట్లు స‌మాన‌మని స్ప‌ష్టం చేశాడు. త‌మ జ‌ట్టు ఆట తీరు బాగో లేద‌ని ఇత‌ర జ‌ట్ల‌ను దూషిస్తే ఎలా అని ప్ర‌శ్నించారు.

Also Read : ధీరుడా ప‌రుగుల వీరుడా సాగిపో

Leave A Reply

Your Email Id will not be published!