Serena Williams : రోజ‌ర్ ఫెద‌ర‌ర్ లివింగ్ లెజెండ్ – సెరెనా

టెన్నిస్ రంగంలో ఫెద‌ర‌ర్ ఓ అద్భుతం

Serena Williams : ప్ర‌పంచ టెన్నిస్ దిగ్గ‌జం రోజ‌ర్ ఫెద‌ర‌ర్ తాను టెన్నిస్ క్రీడా రంగం నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఈ సంద‌ర్భంగా మ‌హిళా దిగ్గ‌జం సెరెనా విలియ‌మ్స్(Serena Williams) స్పందించింది.

ఆమె కూడా ఇటీవ‌ల తాను కూడా వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 41 ఏళ్ల రోజ‌ర్ ఫెద‌ర‌ర్ ను చూసి తాను ఎంతో నేర్చుకున్నాన‌ని తెలిపింది.

ఎలా ఆడాలో, ఎలా సంయ‌మ‌నం పాటించాలో అనే కీల‌క‌మైన‌, విలువైన విష‌యాల‌ను త‌ను నాకు తెలియ చేశార‌ని స్ప‌ష్టం చేశారు సెరెనా విలియ‌మ్స్. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాన్ని తాను స్వాగ‌తిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

24 ఏళ్ల పాటు టెన్నిస్ కెరీర్ లో ఎన్నో మైలు రాళ్లు ఉన్నాయ‌ని ఫెద‌ర‌ర్ నుంచి నేర్చు కోవాల్సింది ఎంతో ఉంద‌న్నారు. ఆయ‌న ఎల్ల‌ప్ప‌టికీ స్పూర్తి దాయ‌కంగా నిలుస్తార‌ని ప్ర‌శంసించారు సెరెనా విలియ‌మ్స్(Serena Williams). రోజ‌ర్ ఫెద‌ర‌ర్ ను లివింగ్ లెజెండ్ గా అభివ‌ర్ణించింది.

ఆయ‌న‌ను చూస్తూ తాను పెరిగాన‌ని, అత‌డితో ఎన్నో మ‌ధుర‌మైన జ్ఞాప‌కాలు ఉన్నాయ‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు సెరెనా. ఇదిలా ఉండ‌గా వ‌చ్చే వారం లండ‌న్ లో జ‌రిగే లావ‌ర్ క‌ప్ త‌న కెరీర్ లో చివ‌రి క‌ప్ అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు రోజ‌ర్ ఫెద‌ర‌ర్(Roger Federer).

మీరు ఎన్నో అద్భుత‌మైన విజ‌యాలు అందుకున్నారు. అన్నింటి కంటే ఆట‌కు కొత్త అర్థాన్ని, అద్భుత‌మైన గౌర‌వాన్ని తీసుకు వ‌చ్చారు.

ఈ ఘ‌న‌త మీకు మాత్ర‌మే ద‌క్కుతుంద‌న్నారు సెరెనా వెలియ‌మ్స్. మీ కెరీర్ లో మీరు ఎన్నో అద్బుతాలు చేశారు. వాటి గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నారు.

Also Read : టెన్నిస్ కు రోజ‌ర్ ఫెద‌ర‌ర్ గుడ్ బై

Leave A Reply

Your Email Id will not be published!