Wisden Cricketers : విజ్డెన్ ఐదుగురు క్రికెట‌ర్ల‌లో రోహిత్..బుమ్రా

అరుదైన ఘ‌న‌త సాధించిన భార‌త క్రికెట‌ర్లు

Wisden Cricketers : ప్ర‌పంచ క్రికెట్ లో అద్భుత‌మైన ప్ర‌తిభా పాట‌వాల‌ను ప్ర‌ద‌ర్శించే ఆట‌గాళ్ల‌ను ప్ర‌తి ఏటా ఐదుగురిని ప్ర‌క‌టిస్తుంది విస్డెన్ సంస్థ‌(Wisden Cricketers). 2021 సంవ‌త్స‌రానికి గాను స‌ద‌రు సంస్థ ఐదుగురిని ఎంపిక చేసింది.

అందులో భార‌త క్రికెట్ కు చెందిన ఇద్ద‌రికి చోటు క‌ల్పించింది. ప్ర‌స్తుతం టీమిండియా కెప్టెన్ గా ఉన్న రోహిత్ శ‌ర్మ‌, స్టార్ పేస‌ర్ జ‌స్ ప్రీత్ బుమ్రా ను ఎంపిక చేసింది.

ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా 2021లో భార‌త టెస్టు జ‌ట్టులో రోహిత్ శ‌ర్మ‌, బుమ్రా కీల‌క పాత్ర పోషించారు.

వీరితో పాటు న్యూజిలాండ్ జ‌ట్టుకు చెందిన స్టార్ ఓపెన‌ర్ డెవాన్ కాన్ వే, ఇంగ్లండ్ పేస‌ర్ ఆలీ రాబిన్ స‌న్ , ద‌క్షిణాఫ్రికా మ‌హిళా కెప్టెన్ డేన్ వాన్ నీకెర్క్ ల‌తో పాటు వీరిద్ద‌రిని ప్ర‌క‌టించింది.

విజ్డెన్ క్రికెట‌ర్స్ ఆల్ ఆఫ్ ఫేమ్ లో 2022 ఎడిష‌న్ లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ప్ర‌పంచంలో ప్ర‌ముఖ క్రికెట‌ర్ గా ఎంపిక‌య్యాడు. 2021లో ఆరు సెంచ‌రీలు చేశాడు.

గ‌త వేస‌విలో బుమ్రా ఇండియా ఆడిన రెండు టెస్టు విజ‌యాల‌లో కీల‌కంగా ఉన్నాడు. లార్డ్స్ లో చివ‌రి టెస్టులో 33 ప‌రుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.

వ‌రుస ఓవ‌ర్ల‌లో ఆలో పీప్ , జానీ బెయిర్ స్టో లోను ఉత్కంఠ భ‌రితమైన బంతుల‌తో అవుట్ చేసి ఇండియాకు విక్ట‌రీ సాధించి పెట్టాడ‌ని లారెన్స్ బూత్ రాశాడు విజ్డెన్(Wisden Cricketers) సంపాద‌కుడు.

నాలుగు టెస్టులో 18 వికెట్లు తీశాడు. ఇక రోహిత్ శ‌ర్మ ఇంగ్లండ్ పై 2-1 ఆధిక్యంలో ఉండేలా చేశాడు. త‌న బ్యాట్ తో ఆక‌ట్టుకున్నాడు.

Also Read : పృథ్వీ షా షాన్ దార్ ఇన్నింగ్స్

Leave A Reply

Your Email Id will not be published!