Rohit Jawa : హెచ్‌యుఎల్ చీఫ్ గా రోహిత్ జావా

ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న సంజీవ్ మెహ‌తా

Rohit Jawa : రోహిత్ జావాకు కీల‌క పోస్ట్ ద‌క్కింది. హిందూస్తాన్ యూనీలీవ‌ర్ లిమిటెడ్ (హెచ్ యుఎల్ ) కొత్త చీఫ్ గా రోహిత్ జావా నియ‌మితుల‌య్యారు. వ‌చ్చే జూన్ 27 నుంచి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. రోహిత్ జావా ప్ర‌స్తుతం లండ‌న్ లోని యూనిలీవ‌ర్ కు ట్రాన్స‌ఫ‌ర్మేష‌న్ చీఫ్ గా ఉన్నారు. ఆయ‌న జ‌న‌వ‌రి 2022 నుండి బాధ్య‌త‌లు చేప‌డుతూ వ‌చ్చారు. యూనిలీవ‌ర్ ద‌క్షిణాసియా అధ్యక్షుడిగా రోహిత్ జావా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు.

క‌న్స్యూమ‌ర్ గూడ్స్ రంగంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తోంది యూనిలీవ‌ర్ . ఒక ద‌శాబ్దం పాటు కంపెనీకి నాయ‌క‌త్వం వ‌హించారు సంజీవ్ మెహ‌తా. ఆయ‌న త్వ‌ర‌లోనే ప‌ద‌వీ విర‌మ‌ణ తీసుకోనున్నారు. దాంతో సంజీవ్ మెహ‌తా స్థానంలో రోహిత్ జావాను మేనేజింగ్ డైరెక్ట‌ర్ , చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీస‌ర్ గా నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది కంపెనీ.

ప్ర‌స్తుతం యూనిలీవ‌ర్ కు ట్రాన్స్ ఫ‌ర్మేష‌న్ చీఫ్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు రోహిత్ జావా(Rohit Jawa) . జూన్ 27, 2023 నుండి వ‌రుస‌గా ఐదు సంవ‌త్స‌రాల పాటు నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు చేప‌డ‌తార‌ని కంపెనీ వెల్ల‌డించింది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రోహిత్ జావా ఏప్రిల్ 1 నుండి హెచ్ యు ఎల్ బోర్డులో హోల్ టైమ్ డైరెక్ట‌ర్ గా చేర‌తారు. భార‌త్ మార్కెట్ తో పాటు యూనిలీవ‌ర్ సౌత్ ఏషియా చీఫ్ గా కూడా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.

రోహిత్ జావా 1988లో మేనేజ్మెంట్ ట్రైనీగా హెచ్ యు ఎల్ లో చేరాడు. భార‌త దేశం, ఆగ్నేషియా , ఉత్త‌ర ఆసియా అంత‌టా స్థిర‌మైన వ్యాపార ఫ‌లితాలను సాధించడంలో కీల‌క పాత్ర పోషించాడు. యూనిలీవ‌ర్ చైనాకు చైర్మ‌న్ గా కూడా ప‌ని చేశారు.

Also Read : ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి రిజైన్

Leave A Reply

Your Email Id will not be published!