Rohit Sharma Gill : చెల‌రేగిన‌ గిల్ అభినందించిన రోహిత్

యంగ్ క్రికెట‌ర్ కు కెప్టెన్ అభినంద‌న‌

Rohit Sharma Gill : ఏ జ‌ట్టు అయినా ఫిదా కావాల్సిందే గిల్ ఆట‌ను తీరు చూశాక‌. గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన క్వాలిఫైయ‌ర్ -2 మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ 62 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ నిప్పులు చెరిగింది. ఏకంగా భారీ స్కోర్ న‌మోదు చేసింది. కేవ‌లం 3 వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 233 ప‌రుగులు చేసింది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసులో బిగ్ టార్గెట్ కావ‌డం ఇదే.

ఆదిలోనే ఓపెన‌ర్ వృద్దిమాన్ సాహా వికెట్ ను కోల్పోయింది. కానీ ఆ త‌ర్వాత ఎక్క‌డా త‌గ్గ‌లేదు శుభ్ మ‌న్ గిల్. ఫోర్లు , సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించాడు. 49 బంతుల్లో సెంచ‌రీ పూర్తి చేశాడు. 60 బంతుల్లో 129 ర‌న్స్ కొట్టాడు. అతి పిన్న వ‌య‌సు క‌లిగిన ఆట‌గాడిగా రికార్డ్ సృష్టించాడు. ఇందులో 7 ఫోర్లు 10 భారీ సిక్స‌ర్లు ఉన్నాయి. క‌ళ్లు చెదిరే షాట్స్ తో ముంబై బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.

ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిన శుభ్ మ‌న్ గిల్(Gill) ను చూసి స్కిప్ప‌ర్ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) మైదానంలో అలాగే ఉండి పోయాడు. ఏమీ చేయ‌లేక పోయాడు. ప్ర‌తి బంతిని మైదానంలోకి త‌ర‌లిస్తుండ‌డంతో ఒకానొక ద‌శ‌లో పాలుపోలేదు స్కిప్ప‌ర్ కు. ఈ సంద‌ర్భంగా మ్యాచ్ సంద‌ర్భంగా ఔట్ అయి మైదానం నుంచి వీడుతున్న సంద‌ర్భంలో రోహిత్ శ‌ర్మ శుభ్ మ‌న్ గిల్ వ‌ద్ద‌కు వ‌చ్చాడు. అత‌డిని ప్ర‌త్యేకంగా అభినందించాడు. క్రీడా స్పూర్తిని చాటాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో వైర‌ల్ గా మారింది.

Also Read : Tilak Varma

 

Leave A Reply

Your Email Id will not be published!