Rohit Sharma Duck : 16 సార్లు డకౌట్..రోహిత్ చెత్త రికార్డ్
ఐపీఎల్ లో హిట్ మ్యాన్ పూర్ పర్ ఫార్మెన్స్
Rohit Sharma Duck : హిట్ మ్యాన్ గా పేరు పొందిన భారత క్రికెట్ జట్టు స్కిప్పర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా గోల్డెన్ డౌకౌట్ (0) అయిన క్రికెటర్ గా చరిత్ర(Rohit Sharma Duck) సృష్టించాడు. తన నిరాశాజనకమైన ఆట తీరుకు ఇది నిదర్శనం.
ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో మరోసారి నిరాశ పరిచాడు రోహిత్ శర్మ. జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
13 ఏళ్ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ చెన్నై వేదికగా ముంబైని ఓడించింది. ఇక ఇరు జట్లు ఐపీఎల్ ఛాంపియన్ లుగా ఉన్నాయి. కానీ గత సీజన్ లో పేలవమైన ఆట తీరును ప్రదర్శించాయి ఇరు జట్లు. కానీ ప్రస్తుత సీజన్ లో మాత్రం తమదైన ఆట తీరుతో ఆకట్టుకుంటన్నాయి.
చెత్త రికార్డులో తనదైన సత్తా చాటాడు రోహిత్ శర్మ(Rohit Sharma). ఇప్పటి దాకా ఐపీఎల్ హిస్టరీలో 16 సార్లు డకౌట్ అయిన క్రికెటర్ గా నిలిచాడు. చెన్నై బౌలర్ వేసిన బంతికి బోల్తా పడ్డాడు హిట్ మ్యాన్. ఫోర్ కొడదామని అనుకున్నాడు. కానీ అనుకోకుండా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ధోనీ తెలివిగా బౌలర్ ను మార్చేశాడు. కెప్టెన్ ప్లాన్ ఫలించింది. వర్కవుట్ అయ్యింది.
Also Read : చెన్నైకి షాకిచ్చిన నెహాల్ వధేరా