Rohit Sharma : కంట్రోల్ చేసుకోక పోతే ఎలా కెప్టెన్

రోహిత్ శ‌ర్మ తీరుపై ఆగ్ర‌హం

Rohit Sharma : భార‌త క్రికెట్ జ‌ట్టుకు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) ఉన్న‌ట్టుండి భావోద్వేగాల‌ను అదుపులో పెట్టుకోలేక పోవ‌డం ప‌లు విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. కెప్టెన్ అన్నాక గెలుపు ఓట‌ములు స‌హ‌జం.

అంద‌రూ ఒకేలా ఆడాల‌ని లేదు. కానీ ఒక్కో ఆట‌గాడికి ఒక్కో ఛాన్స్ వ‌స్తూ ఉంటుంది. ఏదైనా చెప్పాల‌ని అనుకున్నా లేదా సూచ‌న చేయాల‌ని అనుకుంటే డ్రెస్సింగ్ రూమ్ లో జ‌ట్టుకు సంబంధించిన హెడ్ కోచ్ తో పాటు మేనేజ్ మెంట్ తో క‌లిసి కెప్టెన్ క‌లిసి కూర్చుని చ‌ర్చించాలి.

ఒక మ్యాచ్ గెలిశాక ఆ త‌ర్వాత ఓట‌మి పాలైన అనంత‌రం రివ్యూ చేయాల్సి ఉంటుంది. ప్ర‌పంచంలో ఆడే క్రికెట్ జ‌ట్లు చేసే ప‌నే ఇది. తాజాగా యూఏఈ వేదిక‌గా ఆసియా క‌ప్ 2022 న‌డుస్తోంది.

ఇప్ప‌టికే లీగ్ మ్యాచ్ లు పూర్త‌య్యాయి. ఇక సూప‌ర్ -4 కు నాలుగు జ‌ట్లు అర్హ‌త పొందాయి. శ్రీ‌లంక‌, ఆఫ్గ‌నిస్తాన్, ఇండియా, భార‌త్ అర్హ‌త సాధించాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు మ్యాచ్ లు పూర్త‌య్యాయి.

లీగ్ లో ఆఫ్గ‌నిస్తాన్ తో ఓట‌మి పాలైన శ్రీ‌లంక సూప‌ర్ -4 లో ప్ర‌తీకారం తీర్చుకుంది. లంక అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది.

తాజాగా భార‌త్ చేతిలో లీగ్ మ్యాచ్ లో ఓడి పోయింది పాకిస్తాన్. ఇందుకు బ‌దులుగా ప్ర‌తీకారం తీర్చుకుంది సూప‌ర్ -4 లో. బౌల‌ర్ల వైఫ‌ల్యం, చెత్త ఫీల్డింగ్ కార‌ణంగా పూర్తిగా చేతులెత్తేసింది భార‌త జ‌ట్టు.

ఈ సంద‌ర్భంగా రిష‌బ్ పంత్ , హార్దిక్ పాండ్యా స‌రిగా ఆడ‌క పోవ‌డంపై బ‌హిరంగంగానే అంతా చూస్తుండ‌గానే కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) నోరు పారేసు కోవ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.

గ‌తంలో భార‌త జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించిన మ‌హ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్, మ‌హేంద్ర సింగ్ ధోనీని చూసి నేర్చుకుంటే బెట‌ర్.

Also Read : ఆ విష‌యంలో ధోనీ ఒక్క‌డే స్పందించాడు

Leave A Reply

Your Email Id will not be published!