Saba Karim : భారత మాజీ క్రికెటర్ సబా కరీం సంచలన కామెంట్స్ చేశాడు. భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీపై నిప్పులు చెరిగాడు. ఒక రకంగా నిత్యం గాయాలతో సతమతం అయ్యే రోహిత్ శర్మను స్కిప్పర్ గా చేయడం సరైన పద్దతి కాదన్నాడు.
రోహిత్ ప్లేయర్ గా అనుమానం అక్కర్లేదని కానీ ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు గాయం కారణంగా తప్పుకుంటాడో తెలియని పరిస్థితి ఉందన్నారు. ఈ తరుణంలో జట్టుకు బలమైన, స్పూర్తి దాయకంగా ముందుండి నడిపించే నాయకుడు (Saba Karim)కావాలన్నారు.
ఎన్ని పరుగులు చేశావన్నది ముఖ్యం కాదని ఎన్ని విజయాలు జట్టుకు అందించారన్నదే ముఖ్యమన్నాడు. దీనినే అభిమానులు పరిగణలోకి తీసుకుంటారని తెలిపాడు.
పూర్తి ఫిట్ నెస్ తో తిరిగి జట్టులోకి వచ్చినా ఆ తర్వాత రోహిత్ శర్మ గాయపడడని నమ్మకం ఏంటి అంటూ ప్రశ్నించాడు సబా కరీం. ప్రస్తుతానికి టీ20, వన్డే జట్లకు రోహిత్ ను కెప్టెన్ గా ప్రకటించింది.
దీంతో గాయం కారణంగా సఫారీ టూర్ కు దూరంగా ఉన్నాడు. అదే సమయంలో కోహ్లీ తాను తప్పుకుంటున్నట్లు డిక్లేర్ చేశాడు. దీంతో భారత జట్టు శిబిరంలో ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఆటపై ఫోకస్ పెట్టాలంటే సమర్థవంతమైన ఆటగాడు నాయకుడిగా ఉండాలన్నారు సబా కరీం. 2023లో పలు టోర్నీలు ఆడాల్సి ఉందని ఇక కేఎల్ రాహుల్, పంత్, షమీ తదితర ఆటగాళ్లకు నాయకత్వం వహించే నైపుణ్యం లేదని పేర్కొన్నాడు.
ఇప్పటి నుంచే కొత్త నాయకుడిని ఎంపిక చేసే పనిలో సెలక్టర్లు ఉంటే బెటర్ అని సూచించాడు సబా కరీం.
Also Read : బంగ్లాదేశ్ తో భారత్ రె’ఢీ’