Rohit Sharma : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో అనూహ్యంగా ఓటమి పాలు కావడంపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma )తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విచిత్రం ఏమిటంటే మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 161 రన్స్ చేసింది.
అనంతరం బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ ఆదిలోనే వికెట్లను కోల్పోయింది. కానీ అనుకోని రీతిలో పాక్ టూర్ ముగించుకుని పూణెలో నేరుగా అడుగు పెట్టిన స్టార్ ప్లేయర్ పాట్ కమిన్స్ మైదానంలోకి రావడంతోనే సీన్ మరి పోయింది.
ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 14 బంతులు మాత్రమే ఎదుర్కొని హాఫ్ సెంచరీ చేశాడు. ముంబై బౌలర్లను ఉతికి ఆరేశాడు. అప్పటి దాకా పూర్తిగా తమ వైపు ఉన్న మ్యాచ్ ను కోల్ కతా పాలు చేశాడు.
రోహిత్ సేన ఆశలపై నీళ్లు చల్లాడు. ఐపీఎల్ లో రికార్డ్ సృష్టించాడు కమిన్స్. ఏడో స్థానంలో వచ్చాడు. వచ్చీ రావడంతో అరివీర భయంకరుడిగా ఇష్టం వచ్చినట్లు బాదడం మొదలు పెట్టాడు.
దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ అనూహ్యంగా విజయం సాధించింది. మొత్తం నాలుగు మ్యాచ్ లకు గాను మూడింట్లో గెలుపొందింది. ఈ తరుణంలో మూడు మ్యాచ్ లు ఆడిన ముంబై ఓడి పోయింది.
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ(Rohit Sharma )తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాము కష్ట పడ్డామని కమిన్స్ వచ్చాక ఆట తీరు మారి పోయిందన్నాడు.
Also Read : కమిన్స్ సెన్సేషన్ బాద్ షా డ్యాన్స్