Rohit Sharma : భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత జట్టు మొహాలీ వేదికగా శ్రీలంక జట్టుతో ఫస్ట్ టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడారు.
ప్రధానంగా టీమిండియా సాధించిన విజయాలలో అజింక్యా రహానే, ఛతేశ్వర్ పుజారా లు లేక పోవడం తనను బాధకు గురి చేసిందన్నాడు.
వారు అద్భుతమైన ఆటగాళ్లు. మేం కలిసి ఎన్నో కీలకమైన ఇన్నింగ్స్ లు ఆడామన్నాడు. విచిత్రంగా సఫారీ టూర్ లో పేలవమైన ఆట తీరు ప్రదర్శన కారణంగా రహానే, పుజారాలను బీసీసీఐ సెలక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోలేదు.
రంజీ ట్రోఫీలో రహానే సెంచరీ చేసినా పక్కన పెట్టింది. ఇక వారి కెరీర్ ముగిసినట్టేనని అంతా భావించారు. కానీ ఉన్నట్టుండి రోహిత్ శర్మ(Rohit Sharma )వారిద్దరికి మంచి భవిష్యత్తు ఉందన్నాడు. అయితే వీరిద్దరి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నాడు.
ఎవరు వారి స్థానాలను భర్తీ చేస్తారనే దానిపై ఇప్పుడే చెప్పలేనన్నాడు. కొన్నేళ్లుగా భారత జట్టు కోసం కష్టపడ్డారు. ఇద్దరూ 80 నుంచి 90 టెస్టులు ఆడారు. ఎంతో అనుభవం గడించారు.
భారత జట్టు టెస్టు ట్యాంకింగ్స్ లో నెంబర్ 1గా నిలిచేందుకు దోహదం చేశారు. కానీ వాళ్లిప్పుడు లేక పోవడం ఇబ్బంది అనిపిస్తోందన్నారు.
అయితే వారిద్దరినీ భవిష్యత్తులో ఎంపిక చేసే సమయంలో పరిగణలోకి తీసుకుంటామన్నారని రోహిత్ శర్మ తెలిపారు. ఓపెనింగ్ విషయంలో మయాంక్, శుభ్ మన్ గిల్ , శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారిలను ఆలోచిస్తామన్నాడు.
Also Read : ప్రపంచ కప్ తో రావాలి – కోహ్లీ