Rohit Sharma : టెస్టు కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ

ర‌హానే..పుజారా..సాహా అవుట్

Rohit Sharma : అంతా ఊహించిన‌ట్లుగానే జ‌రిగింది. భార‌త జ‌ట్టు టెస్టు కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ‌ను నియ‌మించింది బీసీసీఐ. ఈ మేర‌కు అధికారికంగా ధ్రువీక‌రించింది భార‌త సెలెక్ష‌న్ క‌మిటీ. ఇక నుంచి రోహిత్ శ‌ర్మ (Rohit Sharma)టెస్టు కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టనున్నాడు.

ఇప్ప‌టి దాకా టీ20, వ‌న్డేతో పాటు టెస్టుకు కూడా రోహిత్ కంటిన్యూ కానున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు ఫార్మాట్ ల‌కు విరాట్ కోహ్లీ ఏడేళ్లకు పైగా నేతృత్వం వ‌హించి త‌ప్పుకున్నాడు.

దీంతో అత‌డి ప్లేస్ లో రోహిత్ శ‌ర్మ‌కు చాన్స్ ఇచ్చింది. ప్ర‌స్తుతం విండీస్ తో వ‌న్డే, టీ20 సీరీస్ గెలుచుకుంది. త్వ‌ర‌లో స్వ‌దేశంలో శ్రీ‌లంక‌తో జ‌రిగే టీ20, రెండు టెస్టు మ్యాచ్ ల సీరీస్ కోసం రోహిత్ శ‌ర్మ కు నాయక‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

ఇవాళ ప్ర‌క‌టించింది. టెస్టుల‌కు కెప్టెన్ గా రోహిత్ ఎంపిక క‌గా ఆయ‌న‌కు తోడుగా ఊహించ‌ని రీతిలో జ‌స్ ప్రీత్ బుమ్రాను ఎంపిక చేసింది బీసీసీఐ. స‌ఫారీతో సీరీస్ కోల్పోయింది టీమిండియా.

ఆ త‌ర్వాత తాను త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు కోహ్లీ. దీంతో ఎవ‌రిని నియ‌మిస్తామ‌ర‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. చివ‌రికు టెన్ష‌న్ కు తెర దించింది. ఇక నుంచి అన్ని ఫార్మాట్ ల‌కు స్కిప్ప‌ర్ గా రోహిత్ శ‌ర్మ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

ఇంత కాలం జ‌ట్టుకు సేవ‌లందించిన అజింక్యా ర‌హానే తో పాటు ఛ‌తేశ్వ‌ర్ పుజారా, సాహాను ప‌క్క‌న పెట్టింది. విచిత్రం ఏమిటంటే రంజీ ట్రోఫీలో సెంచ‌రీ సాధించినా ర‌హానేకు ఛాన్స్ ఇవ్వ‌లేదు సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ చేత‌న్ శ‌ర్మ‌.

Also Read : అర్జున్ టెండూల్క‌ర్ ఆట చూడ‌ను

Leave A Reply

Your Email Id will not be published!