Rohit Sharma Tilak Varma : రాణించిన శర్మ సత్తా చాటిన వర్మ
ఢిల్లీ క్యాపిటల్స్ పై ఉత్కంఠ భరిత విక్టరీ
Rohit Sharma Tilak Varma : ఐపీఎల్ 16వ సీజన్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది రోహిత్ సేన. ఇప్పటి వరకు ఆర్సీబీ, సీఎస్కే చేతిలో చావు దెబ్బ తిన్న ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు ఓ విజయాన్ని సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 22 ఇన్నింగ్స్ ల సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(Rohit Sharma Tilak Varma) ఢిల్లీ బౌలర్లను ఎదుర్కొని 41 రన్స్ చేశాడు. గెలుపులో తనదైన ముద్ర కనబర్చాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ లో మరోసారి సత్తా చాటాడు కెప్టెన్ డేవిడ్ వార్నర్ . ఆ జట్టుకు ఇది నాలుగో మ్యాచ్ . వార్నర్ తో పాటు ఆల్ రౌండర్ గా పేరొందిన అక్షర్ పటేల్ దుమ్ము రేపాడు. ఐపీఎల్ కెరీర్ లో తన తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 172 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక రకంగా ముంబై ముందు భారీ టార్గెట్ ఉంచింది.
ఈ మ్యాచ్ కూడా చివరి బంతి దాకా నువ్వా నేనా అన్న రీతిలో సాగింది. వార్నర్ 47 బంతులు ఎదుర్కొని 51 రన్స్ చేస్తే అక్షర్ పటేల్ 24 బాల్స్ ఎదుర్కొని 54 రన్స్ చేశాడు. ఇక రోహిత్ శర్మ 45 బంతులలో 65 పరుగులు చేశాడు. కామెరాన్ గ్రీన్ 17 పరుగులతో , టిమ్ డేవిడ్ 11 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఇక తిలక్ వర్మ 29 బంతులు ఎదుర్కొని 41 రన్స్ సాధించాడు.
Also Read : బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్