Rohit Sharma : ఎవరీ హిట్ మ్యాన్ అనుకుంటున్నారా. భారత క్రికెట్ జట్టుకు అన్ని ఫార్మాట్ లలో కెప్టెన్ గా ఉన్న ముంబైకి చెందిన రోహిత్ శర్మ(Rohit Sharma). అతడికి మరో పేరు కూడా ఉంది అదే హిట్ మ్యాన్ అని.
ఎలాంటి బంతులనైనా అలవోకగా సిక్స్ లుగా మలిచే సత్తా ఉన్నోడు రోహిత్ శర్మ(Rohit Sharma). గత కొన్నేళ్లుగా ఐపీఎల్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు సారథిగా ఉన్నాడు.
అతడి సారథ్యంలో ముంబై ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021లో సైతం ముంబై ఇండియన్స్ చెత్త ప్రదర్శనతో వెనుదిరిగింది ప్లే ఆఫ్స్ కు చేరకుండానే.
ఇక మొదట్లో ఓటమి పాలైనా ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకునే ఏకంగా టైటిల్ ఎగరేసుకు పోయింది చెన్నై సూపర్ కింగ్స్ . ఆ జట్టు సైతం 7 మ్యాచ్ లు ఆడి 2 గెలిచింది. ఇంకా బరిలో నిలవాలంటే అన్ని మ్యాచ్ లు గెలవాల్సి ఉంటుంది.
ఇక ముంబై ఇండియన్స్ వరకు చూస్తే ఏడు మ్యాచ్ లు ఆడి ఓటమి మూటగట్టుకుంది. కెప్టెన్ అన్నాక ముందుండి నడిపించాలి. అటు బ్యాటింగ్ లోనూ పూర్తిగా విఫలమయ్యాడు రోహిత్ శర్మ.
ఇదే సమయంలో విజ్డెన్ 2021 సంవత్సరానికి ప్రపంచంలో 5 మంది క్రికెటర్లను ఎంపిక చేసింది. వారిలో రోహిత్ శర్మ, బుమ్రా ఉన్నారు. భారత జట్టుకు విజయాలు సాధించిన సారథిగా పేరు తెచ్చుకున్నా ఈ హిట్ మ్యాన్ మంత్రం ఈసారి ఐపీఎల్ లో పని చేయలేదు.
ముంబై ఇండియన్స్ కు హెడ్ కోచ్ గా ఉన్న మహేళ జయవర్దనే ప్లాన్ వర్కవుట్ కాలేదు. ఏది ఏమైనా ఈ ఐపీఎల్ మాత్రం రోహిత్ కు ఓ పీడకలగా మారిందన్నది వాస్తవం.
Also Read : వేగం బౌలింగ్ కు ప్రామాణికం కాదు