Rohith Vemula Comment : అతడి మరణం ప్రశ్నార్థకం
రోహిత్ వేముల ధిక్కార స్వరం
Rohith Vemula Comment : జీవితం పట్ల..సమస్త ప్రపంచం పట్ల ఎరుకతో ఉండడం. సామాజిక బాధ్యతను భుజాల మీద వేసుకోవడం. పేదలు, సామాన్యుల పట్ల ప్రేమ కలిగి ప్రయాణించడం చాలా కష్టం. యావత్ లోకమంతా ప్రపంచీకరణ భావజాలంలో, మార్కెట్ పరమై ప్రేమ కరువైన తరుణంలో ప్రతి వ్యవస్థా నిర్వీర్యమై దిక్కు తోచని స్థితిలో కొట్టు మిట్టాడుతూ ఉండగా మిణుకు మిణుకు మంటూ రోహిత్ వేముల కనిపించాడు.
ఇవాళ రోహిత్ ను(Rohith Vemula) గుర్తు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కులం నిచ్చెన మెట్ల మీద దేశం కొనసాగుతోంది. విద్యా బుద్దులు నేర్పాల్సిన విద్యా సంస్థలు కులం , మతం, ప్రాంతాలకు నెలవుగా మారాయి.
బతుకంతా ఘర్షణతో కూడుకున్నది కావడంతో అనుభవం నేర్పిన పాఠం ధిక్కార స్వరం వినిపించేలా చేసింది. సమాజం బానిస లాగా ఉండాలని కోరుకుంటుంది. కానీ ప్రశ్నించడాన్ని, నిలదీయడాన్ని , తప్పుల్ని ఎత్తి చూపడాన్ని భరించదు.
విశ్వ విద్యాలయాలకు ప్రపంచాన్ని కొత్త కోణంలో దర్శించేందుకు మార్గదర్శకాలుగా ఉపయోగ పడతాయి. 27 ఏళ్ల వయస్సులో ఎంతో అనుభవం గడించిన రోహిత్ వేముల ఆత్మహత్య ఎన్నో ప్రశ్నల్ని మిగిల్చింది. అభిప్రాయ భేదాలు ఎన్ని ఉన్నా ఈ మట్టి మీద మొలకెత్తిన ప్రతి ఒక్కరికీ బతికేందుకు హక్కు ఉంది.
విద్యా రంగంలో దళితులపై విస్తృతంగా జరుగుతున్న వివక్ష, దౌర్జన్యాలను గ్రహించాడు..దానిని నిరసించాడు రోహిత్ వేముల. చాలా మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొంటున్న అకడమిక్ ఎక్సలెన్స్ , స్వయం ప్రతిపత్ఇ వల్ల ఉపయోగం ఏమిటి అనే దానిపై కూడా ఆలోచించాలల్సి ఉంటుంది. విద్య ప్రధాన లక్ష్యం ఒక్కటే . మనిషిగా మార్చడం. కానీ ఇవేవీ ఇవాళ అందకుండా పోయాయి. ఫక్తు వ్యాపారంగా మారింది.
ఓ వైపు ప్రపంచం వేగంగా మారుతున్నా ఇంకా భారత దేశంలో విద్యా వ్యవస్థ తన స్థాయిని చేరుకోలేక పోతోందన్న విమర్శలు లేక పోలేదు. రోహిత్ వేములకు జీవితం పట్ల సమగ్రమైన అవగాహన ఉంది. కానీ సమాజం భరించ లేక పోయందన్నది వాస్తవం. ఎందుకంటే ప్రతిభే ప్రతిబంధకంగా మారింది. ఇవాళ అంబేద్కర్ ఐకాన్ గా మారారు.
ఆయనను ఉచ్చరించడం ఫ్యాషన్ గా మారింది. ఆయన భావజాలాన్ని కూడా ఆధిపత్య శక్తులు ఆక్రమించాయి. కులమనే మచ్చ కాటికి వెళ్లేంత దాకా కొనసాగుతూనే ఉంటుంది. అది సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇవాళ రోహిత్ వేముల(Rohith Vemula) లేడు. అతడి మరణం వేల ప్రశ్నల్ని..మిగిల్చింది
Also Read : ఆ ఇద్దరి నుంచి ఎంతో నేర్చుకున్నా