Cristiano Ronaldo : రొనాల్డోకు సౌదీ ఫుట్ బాల్ క్లప్ బంపర్ ఆఫర్
రూ. 1836 కోట్ల బిగ్ ప్యాకేజీ ఇచ్చేందుకు రెడీ
Cristiano Ronaldo : సాకర్ ప్రపంచంలో మోస్ట్ పాపులర్ ఫుట్ బాలర్ పోర్చుగల్ కు చెందిన స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు ఊహించని రీతిలో ఆఫర్ లభించింది. ఏకంగా రూ. 1836 కోట్ల ఆఫర్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఇది అక్షరాల నిజం.
ఇటీవలే ఇంగ్లండ్ కు చెందిన ఫేమస్ ఫుట్ బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ రొనాల్డ్(Cristiano Ronaldo) కు చెక్ పెట్టింది. తమకు వద్దంటూ తొలగించింది. ఈ నిర్ణయం యావత్ సాకర్ లోకాన్ని విస్తు పోయేలా చేసింది. ఒక రకంగా షాక్ కు గురైన వెంటనే అదృష్టం రూపంలో సౌదీ అరేబియా తలుపు తట్టింది.
వారం రోజులు గడవక ముందే భారీ ఆఫర్ ను ప్రకటించింది. భారీ ప్యాకేజీ ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామని వెల్లడించింది సౌదీ అరేబియా ఫుట్ బాల్ క్లబ్ అన్ న్రస్ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఇంత పెద్ద ఎత్తున ఆఫర్ ప్రకటించడంతో ఒక్కసారిగా రొనాల్డ్ తో పాటు ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు.
ఇదిలా ఉండగా ఇంకా ఈ అద్భుత అవకాశం ఇవ్వడంపై స్పందించ లేదు పోర్చుగల్ వీరుడు క్రిస్టియానో రొనాల్డో. ఈ భారీ ప్యాకేజీలో భాగంగా మూడేళ్ల పాటు కాంట్రాక్టు ఉంటుందని సౌదీ అరేబియా ఫుట్ బాల్ క్లబ్ పేర్కొంది. ఏడాదికి రూ. 612 కోట్ల చొప్పున మొత్తం మూడేళ్లకు చెల్లించనుంది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) వయస్సు 37 ఏళ్లు ఒకవేళ గనుక ఒప్పందం కుదుర్చుకుంటే మూడు సంవత్సరాల పాటు సౌదీ అరేబియా ఫుట్ బాల్ క్లబ్ కు ఆడాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వడం సౌదీ అరేబియా సాకర్ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం.
Also Read : పాకిస్తాన్ బాధితుల కోసం బెన్ స్టోక్స్ విరాళం