Ronaldo Junior : వారెవ్వా జూనియ‌ర్ రొనాల్డో సూప‌ర్

తండ్రిని మించిన త‌న‌యుడు

Ronaldo Junior : ప్ర‌పంచ ఫుట్ బాల్ చ‌రిత్ర‌లో క్రిస్టియానో రొనాల్డో అంటే ఓ సెన్సేష‌న్ . అత‌డు మైదానంలోకి వ‌చ్చాడంటే చాలు ల‌క్ష‌లాది మంది అభిమానులు ఊగి పోతారు. డ్యాన్సుల‌తో హోరెత్తిస్తారు.

బంతిని ఎప్పుడు ఎలా తీసుకు వెళ‌తాడో, ఎప్పుడు గోల్ చేస్తాడో ప్ర‌త్య‌ర్థుల‌కు అంతు ప‌ట్ట‌దు. మ‌నోడికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు వ‌ర‌ల్డ్ వైడ్ గా. తాజాగా రొనాల్డో(Ronaldo Junior) త‌న‌యుడు రొనాల్డో జూనియ‌ర్ సైతం ఫుట్ బాల‌ర్ గా రాణిస్తున్నాడు.

ఫుల్ ప్రాక్టీస్ లో మునిగి పోయాడు. తండ్రి అడుగు జాడ‌ల్లో న‌డుస్తూ త‌న‌ను తాను ప్రూవ్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నాడు. తాజాగా మాంచెస్ట‌ర్ యునైటెడ్ అండ‌ర్ -12 జ‌ట్టు త‌ర‌పున జూనియ‌ర్ రొనాల్డో(Ronaldo Junior) ఆడుతున్నాడు.

అచ్చం రొనాల్డోను త‌ల‌పింప చేసేలా ఆడాడు. బంతిని కాళ్ల నుంచి తోసుకుంటూ దూసుకెళ్ల‌డం క‌ళ్ల‌ను విస్తు పోయేలా చేసింది. త‌న తండ్రి వేడుక జ‌రుపుకునేలా చేశాడు.

ఎప్పుడైనా మ్యాచ్ ఆడుతున్న సంద‌ర్భంలో గోల్ చేస్తే ఫుల్ జోష్ లో సెల‌బ్రేష‌న్ చేసుకుంటాడు క్రిస్టియానో రొనాల్డో. సేమ్ కొడుకు రొనాల్డో జూనియ‌ర్ సైతం అలానే ప్రాక్టీస్ చేశాడు.

స్పెయిన్ లో జ‌రిగిన యూత్ టోర్న‌మెంట్ లో గిరినెస్ స‌బాటో టీంను 5-0 తో ఓడించాడు. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మాంచెస్ట‌ర్ యునైటెడ్ అండ‌ర్ -12 టీం కోసం రెండో గోల్ చేశాడు రొనాల్డో జూనియ‌ర్.

11 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన ఈ జూనియ‌ర్ చిన్న‌ప్ప‌టి నుంచే బంతితో ఆడ‌డం ప్రాక్టీస్ చేశాడు. మ్యాచ్ 68వ నిమిషంలో మెరుపులా వ‌చ్చాడు. క‌ళ్లు చెదిరేలా బంతిని గోల్ గా మ‌లిచాడు.

Also Read : శాంస‌న్ పాండ్యాను చూసి నేర్చుకో

Leave A Reply

Your Email Id will not be published!