Roshni Nadar : అత్యంత సంప‌న్న‌ మ‌హిళ‌గా రోష్ణీ నాడ‌ర్

కోట‌క్ ప్రైవేట్ బ్యాంకింగ్ హూరున్ లిస్ట్

Roshni Nadar : ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జ కంపెనీ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ చైర్ ప‌ర్స‌న్ రోష్ణీ నాడ‌ర్ అరుదైన ఘ‌న‌త సాధించారు. భార‌త దేశంలో అత్యంత ధ‌నిక (రిచెస్ట్ ) మ‌హిళ‌గా నిలిచారు.

ప్ర‌తి ఏటా కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్ హురున్ క‌లిసి ధ‌న‌వంతుల మ‌హిళ‌ల జాబితాను ప్ర‌క‌టిస్తుంది. ఈ ఏడాది రోష్ణీ నాడ‌ర్(Roshni Nadar) టాప్ లో నిలిచారు. నైకా చీఫ్ గా ఉన్న ఫ‌ల్గుణి నాయ‌ర్ రూ. 57, 520 కోట్ల నిక‌ర విలువ‌తో అత్యంత స్వీయ నిర్మిత మ‌హిళగా నిలిచింది.

ఇక టాప్ లో నిలిచిన చైర్ ప‌ర్స‌న్ రోష్ణీ నాడ‌ర్(Roshni Nadar) 2021లో త‌న నిక‌ర విలువ 54 శాతం పెరిగింది. రూ. 84, 830 కోట్ల‌కు చేరుకుంద‌ని స్ప‌ష్టం చేసింది. దేశంలోనే అత్యంత సంప‌న్న‌మైన మ‌హిళ‌గా త‌న స్థానాన్ని ప‌దిలం చేసుకుంది.

గ‌త ఏడాదిలో కూడా ఆమె టాప్ లో నిలవ‌డం విశేషం. ఇక ఫ‌ల్గుణి నాయ‌క‌ర్ వ‌య‌స్సు 59 ఏళ్లు. త‌న సంప‌ద‌లో 963 శాతం వృద్ధిని సాధించారు. రెండో అత్యంత సంప‌న్న మ‌హిళగా నిలిచారు.

హెచ్ సీఎల్ టెక్నాల‌జీస్ ఫౌండ‌ర్ అయిన త‌మిళ‌నాడుకు చెందిన శివ నాడ‌ర్ కూతురే ఈ రోష్ణీ నాడ‌ర్. ఆమెకు ఇప్పుడు 40 ఏళ్లు. ఇక బ‌యోకాన్ కి చెందిన కిర‌ణ్ మ‌జుంద‌ర్ షా సంప‌ద 21 శాతం క్షీణించింది.

రూ. 29,030 వేల కోట్ల సంప‌ద‌తో దేశంలో మూడో అత్యంత సంప‌న్న మ‌హిళ‌గా నిలిచింది. ఇదిలా ఉండ‌గా 100 మంది మ‌హిళ‌ల జాబితాలో కేవ‌లం భార‌తీయ మ‌హిళ‌లు మాత్ర‌మే ఉన్నారు.

భార‌త దేశంలో పుట్టి లేదా పెరిగిన వారిని మాత్ర‌మే ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారు. 2020లో రూ. 2.72 ల‌క్ష‌ల కోట్ల నుండి రూ. 2021 ఏడాదిలో రూ. 4.16 ల‌క్ష‌ల కోట్ల‌కు పెంచేలా చేశారు.

Also Read : ర‌త‌న్ టాటా ఆశీర్వాదం షిండే సంతోషం

Leave A Reply

Your Email Id will not be published!