RCB vs CSK IPL 2022 : చేతులెత్తేసిన చెన్నై బెంగ‌ళూరు విక్ట‌రీ

రాణించిన మ‌హిపాల్ మెరిసిన హ‌ర్ష‌ల్

RCB vs CSK : ప్లే ఆఫ్స్ కు చేరుకోవాల‌ని అనుకుంటున్న చెన్నై సూప‌ర్ కింగ్స్ (RCB vs CSK)ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది ప్లాఫ్ డుప్లెసిస్ సార‌థ్యంలోని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు. టాస్ గెలిచిన సీఎస్కే కెప్టెన్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

బ‌రిలోకి దిగిన ఆర్సీబీ ప‌రుగులు చేసేందుకు నానా తంటాలు ప‌డింది. పుణె వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో చివ‌ర‌కు 13 ప‌రుగుల తేడాతో గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది ఆర్సీబీ.

ఇక బెంగ‌ళూరు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 173 ప‌రుగులు చేసింది. మ‌హిపాల్ లోమ్రోర్ ధాటిగా ఆడాడు. 27 బంతులు ఎదుర్కొని 42 ర‌న్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు ఒక సిక్స్ ఉంది.

174 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన సీఎస్కే 160 ర‌న్స్ కే ప‌రిమిత‌మైంది. డేవిన్ కాన్వే దుమ్ము రేపాడు. 37 బంతులు ఎదుర్కొని 56 ర‌న్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు 2 సిక్స‌ర్లు ఉన్నాయి.

చెన్నై ప‌త‌నాన్ని మాత్రం శాసించింది హ‌ర్ష‌ల్ ప‌టేల్ . 4 ఓవ‌ర్ల‌లో 35 ర‌న్స్ ఇచ్చి మూడు కీల‌క వికెట్లు తీశాడు. దాంతో అత‌డినే వ‌రించింది ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్.

కెప్టెన్ డుప్లెసిస్ 38 ర‌న్స్ చేస్తే విరాట్ కోహ్లీ 30, దినేష్ కార్తీక్ 26 ప‌రుగులు చేసి రాణించారు. మొత్తంగా చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశ‌లు ఆవిరి అయిన‌ట్టేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఒక వేళ బెంగ‌ళూరు పై గెలిచి ఉంటే ఆశ‌లు స‌జీవంగా ఉండేవి. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే బ్యాటింగ్ లో త‌డ‌బ‌డినా బెంగ‌ళూరు బౌల‌ర్ల ప్ర‌తిభ‌తో విజయాన్ని ద‌క్కించుకుంది.

Also Read : 23 నుంచి మ‌హిళ‌ల టీ20 టోర్నీ

Leave A Reply

Your Email Id will not be published!