RCB vs GT IPL 2022 : గుజ‌రాత్ జైత్ర‌యాత్ర‌కు ఆర్సీబీ బ్రేక్

ఫామ్ లోకి వ‌చ్చిన విరాట్ కోహ్లీ

RCB vs GT IPL 2022 : వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతూ ఇప్ప‌టికే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో ఫ‌స్ట్ ప్లేస్ లో నిలిచి త‌న స్థానం ప‌దిలం చేసుకున్న హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది రాయ‌ల్స్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు.

భార‌త స్టార్ ప్లేయ‌ర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స‌త్తా చాటాడు. ప‌రుగుల లేమితో నానా తంటాలు ప‌డుతున్న విరాట్ గుజ‌రాత్(RCB vs GT IPL 2022) పై అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు.

త‌న జ‌ట్టుకు విజ‌యాన్ని చేకూర్చి పెట్ట‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఓపెన‌ర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ పాఫ్ డుప్లెసిస్ తో క‌లిసి భారీ ఓపెనింగ్ భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేశారు.

అవ‌స‌ర‌మైన ప్ర‌తి స‌మ‌యంలోనూ బంతిని విడువ‌కుండా క‌ళాత్మ‌క‌మైన షాట్స్ ఆడాడు కోహ్లీ. 169 ప‌రుగుల టార్గెట్ తో మైదానంలోకి దిగిన ఆర్సీబీ(RCB vs GT IPL 2022) 8 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.

వీరిద్ద‌రూ ఔట్ అయ్యాక వ‌చ్చిన గ్లెన్ మ్యాక్స్ వెల్ దుమ్ము రేపాడు. గ్లెన్ కేవ‌లం 18 బంతులు మాత్ర‌మే ఆడాడు. 40 ప‌రుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. దిమ్మ తిరిగేలా సిక్స‌ర్లు కొట్టాడు.

ఇక గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టులో ఆఫ్గ‌నిస్తాన్ ప్లేయ‌ర్, జ‌ట్టు వైస్ కెప్టెన్ గా ఉన్న ర‌షీద్ ఖాన్ ఒక్క‌డే రెండు వికెట్లు తీశాడు. ఇక ఈ గెలుపుతో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ప్లే ఆఫ్స్ ఆశ‌లు ఇంకా స‌జీవంగా ఉన్నాయి.

మ‌రో వైపు కీల‌క మ్యాచ్ ఇవాళ రాజ‌స్తాన్ రాయ‌ల్స్ , చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌ధ్య జ‌ర‌గ‌నుంది.

Also Read : ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ వేళ‌ల్లో మార్పు

Leave A Reply

Your Email Id will not be published!