RCB vs MI : ఐపీఎల్ 2022 టైటిల్ ఫెవరేట్ గా ఉన్న ముంబై ఇండియన్స్ కు ఈసారి ఐపీఎల్ అచ్చిరానట్టుంది. 152 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB vs MI )సునాయసంగా గెలుపు సాధించింది. హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది.
దీంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ కు వెళ్లడం కష్టమే. రాబోయే ప్రతి మ్యాచ్ గెలవాల్సిన అవసరం ఉంది. ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్(RCB vs MI )6 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ఒక దశలో 5 వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ముంబైని గట్టెక్కించాడు ఒకే ఒక్కడు సూర్య కుమార్ యాదవ్.
ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా ఇంకోవైపు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 5 ఫోర్లు 6 సిక్సర్లతో రెచ్చి పోయాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మొత్తం 68 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
అనంతరం 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు సూపర్ గా ఆడింది. అనూజ రావత్ అద్భుతంగా రాణించాడు. 47 బంతుల్లో 2 ఫోర్లు 6 సిక్సర్లతో చెలరేగాడు.
66 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు ఆర్సీబీలో. మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీ 36 బంతులు ఆడి 5 ఫోర్లతో 48 పరుగులు చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు ఏకంగా 80 రన్స్ చేశారు. డుప్లెసిస్ ధాటిగా ఆడాడు.
ఇదిలా ఉండగా సూర్య కుమార్ ఆకట్టుకున్నా ఇషాన్ , రోహిత్ మెరిసినా బిగ్ స్కోర్ చేయలేక పోయింది ముంబై ఇండియన్స్. దీంతో ఓటమి తప్పలేదు.
Also Read : ‘సూర్య’ భాయ్ జీతే రహో