RR vs RCB : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా ముంబై వేదికగా జరుగుతున్న సమ ఉజ్జీల సమరంలో రాయల్ ఛాలెంజర్స్ ముందు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది రాజస్థాన్ రాయల్స్. ఆర్సీబీ (RR vs RCB )కెప్టెన్ డుప్లిసిస్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఆదిలోనే ఆర్ఆర్ ఓపెనర్ జైశ్వాల్ వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత జోస్ బట్లర్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసే దాకా ఆడాడు. జట్టులో మరోసారి కీలక పాత్ర పోషించాడు. బట్లర్ 47 బంతులు ఎదుర్కొని 70 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఇందులో ఆరు కళ్లు చెదిరే సిక్సర్లు ఉన్నాయి. వరుసగా రాణించడంతో గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది రాజస్తాన్. మరో స్టార్ హిట్టర్ హిట్ మైర్ దుమ్ము రేపాడు. మరోసారి సత్తా చాటాడు.
31 బంతులు ఆడి 4 ఫోర్లు 2 సిక్సర్లతో 42 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వీరిద్దరూ స్కోర్ ను పరుగులు తీయించారు. మరోసారి నిరాశ పరిచాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్. కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు.
దేవదత్ పడిక్కల్ 38 పరుగులు చేశాడు. కీలక పాత్ర పోషించాడు. మూడు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్(RR vs RCB )నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 169 పరుగులు చేసింది.
ఇక ఐపీఎల్ రిచ్ లీగ్ లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లు ఆడిన ఆర్ఆర్ రెండింట్లోనూ విజయం సాధించింది. ఇక ఆర్ఆర్ భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేయడంలో బెంగళూరు బౌలర్లు సక్సెస్ అయ్యారు.
Also Read : శ్రీలంక సర్కార్ పై క్రికెటర్ల కన్నెర్ర