RR IPL 2022 Qualifier2 : రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కు అగ్ని ప‌రీక్ష

జోరు మీదున్న బెంగ‌ళూరుతో సై

RR IPL 2022 Qualifier2 : మిస్ట‌ర్ కూల్ గా మ‌హేంద్ర సింగ్ ధోనీ త‌ర్వాత పేరు తెచ్చుకున్న ఏకైక ప్లేయ‌ర్ ఐపీఎల్ లో ఒకే ఒక్క‌డు కేర‌ళ స్టార్ సంజూ శాంసన్. త‌న కెరీర్ లో ఇది ఒక మైలురాయిగా చెప్పు కోవ‌చ్చు.

దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన 14వ సీజ‌న్ లో వ్య‌క్తిగ‌త స్కోర్ చేసిన ఆట‌గాళ్ల జాబితాలో టాప్ లో ఉన్నాడు శాంస‌న్. కానీ జ‌ట్టును గ‌ట్టెక్కించ లేక పోయాడు. అయినా రాజ‌స్తాన్ రాయ‌ల్స్ మేనేజ్ మెంట్ మాత్రం అత‌డిపై న‌మ్మ‌కం ఉంచింది.

వేలం పాట‌కు వెళ‌తాడ‌ని ప్ర‌చారం జ‌రిగినా త‌ను మాత్రం రాజ‌స్తాన్ వైపు మొగ్గు చూపాడు. ఎలాంటి అంచ‌నాలు లేకుండానే బ‌రిలోకి దిగిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్(RR IPL 2022 Qualifier2) ను ఫ్లే ఆఫ్స్ కు చేర్చడంలో కీల‌క పాత్ర పోషించాడు.

బ్యాటింగ్ మెరిపించక పోయినా ఆ జ‌ట్టును స‌మిష్టిగా న‌డిపించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు శాంస‌న్. ఇక బ్యాటింగ్ ప‌రంగా చూస్తే దుర్బేద్యంగా క‌నిపిస్తోంది.

ప్ర‌ధానంగా ప‌డిక్క‌ల్, జైశ్వాల్, జోస్ బ‌ట్ల‌ర్ , సంజూ శాంస‌న్ , ర‌విచంద్ర‌న్ అశ్విన్, రియాన్ ప‌రాగ్, సిమ్రోన్ హిట్ మైర్ ఏ స‌మ‌యంలోనైనా దాడి చేసి విధ్వంసం సృష్టించే వారే.

ఇక బౌలింగ్ లో మెక్ కామ్ , ప్రసిద్ద్ కృష్ణ‌, ఆర్. అశ్విన్, చాహ‌ల్ రాణించ‌డం పైనే ఆధార‌ప‌డి ఉంది ఇవాళ జ‌రిగే మ్యాచ్ . గుజ‌రాత్ తో గెలుపు అంచుల దాకా వ‌చ్చిన రాజ‌స్తాన్ ఆఖ‌రి ఓవ‌ర్ లో మేనేజ్ చేయ‌లేక పోయింది.

దీంతో 7 వికెట్ల తేడాతో ఓట‌మి మూట‌గ‌ట్టుకుంది. ఇక ఇవాళ జ‌రిగే సిసలైన పోరులో శాంస‌న్ రాణించ‌డంపైనే ఆధార ప‌డి ఉంది.

Also Read : విజ‌యానికి అడుగు దూరంలో ఆర్సీబీ

Leave A Reply

Your Email Id will not be published!