LAFCA Award Keeravani : ఆర్ఆర్ఆర్ కు మ‌రో పుర‌స్కారం

ఎల్ఎఫ్‌సీఏ అవార్డు అందుకున్న కీర‌వాణి

LAFCA Award Keeravani : ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆర్ఆర్ఆర్ మూవీకి ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌నాద‌ర‌ణ ల‌భిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు అవార్డుల‌ను గెలుచుకున్న ఈ చిత్రానికి మ‌రో అరుదైన అవార్డు ద‌క్కించుకుంది. జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన ఆర్ఆర్ఆర్ మూవీకి ఎంఎం కీర‌వాణి సంగీతం అందించారు.

ఇప్ప‌టికే ఈ చిత్రానికి అస్సెట్ గా నిలిచిన నాటు నాటు సాంగ్ కు గాను ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. తాజాగా మ‌రో పుర‌స్కారం ల‌భించింది సినిమాకు. బెస్ట్ ఒరిజిన‌ల్ స్కోర్ మ్యూజిక్ కేట‌గిరిలో ఆర్ఆర్ఆర్ కు లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ అవార్డు వ‌రించింది.

ఈ సంద‌ర్భంగా అమెరికాలోనే ఉంది ఆర్ఆర్ఆర్ టీం. ఈ మేర‌కు సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీర‌వాణి(LAFCA Award Keeravani) అవార్డును అందుకున్నారు. ఇదే విష‌యాన్ని ఆర్ఆర్ఆర్ బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంది. కీర‌వాణికి అభినంద‌న‌లు తెలియ చేసింది ప్ర‌త్యేకంగా చిత్ర బృందం. సామాజిక మాధ్య‌మాల‌లో మ్యూజిక్ డైరెక్ట‌ర్ ను ప్ర‌శంసిస్తూ ట్వీట్ల‌తో హోరెత్తి పోతోంది.

ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సులు బ‌ద్ద‌లు కొట్టింది. ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి టాక్ వ‌చ్చింది. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ప‌నిత‌నానికి గుర్తింపు ల‌భించింది. అంతే కాదు యావ‌త్ లోకం మెచ్చిన జేమ్స్ కామ‌రాన్ ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌ను కొనియాడారు. అంతే కాదు ఆ సినిమాను తాను రెండుసార్లు చూశాన‌ని చెప్పారు.

ఇదే విష‌యాన్ని పంచుకున్నారు ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి. ఇప్ప‌టికే దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుడిగా పేరొందారు కీర‌వాణి.

Also Read : మేరా భార‌త్ మ‌హాన్..జై హింద్

Leave A Reply

Your Email Id will not be published!