RRR Movie : దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ (రుధిరం-రౌద్రం-రణం) మూవీ విడుదలై దుమ్ము రేపుతోంది. భారీ సక్సెస్ టాక్ తో వసూళ్లలో టాప్ కు దూసుకు వెళుతోంది.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ , అజయ్ దేవగన్, అలియా భట్ కలిసి నటించారు. భారత దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన 3వ చిత్రంగా నిలిచింది ప్రస్తుతానికి. తాజా అంచనా ప్రకారం రూ. 1000 కోట్లకు దగ్గరగా ఉంది.
బాక్సాఫీస్ ల వద్ద కాసులు కురిపిస్తోంది. ఈ చిత్రం మొదటి రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 969.24 కోట్లను దాటింది. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో ఈ చిత్రం మరో రెండు మూవీస్ అధిగించాలంటే ఇంకా ప్రయాణం సాగించాల్సి ఉంటుంది.
దేశంలో ఇప్పటి దాకా టాప్ లో ఉన్న చిత్రం రూ. 2024 కోట్లు సాధించంది. రాజమౌళి తీసిన బాహుబాలి ది కన్ క్లూజన్ రూ. 1810 కోట్లు నిలిచి రెండో స్థానంలో నిలిచింది.
ప్రస్తుతం తానే తీసిన ఆర్ఆర్ఆర్ మూవీ మూడో స్థానంలో నిలవడం విశేషం. సినిమా విజయానికి ప్రధాన కారణం. సినిమా యూనివర్శిల్ అప్పీల్. భాష, మతం, కుల వర్గాలను దాటుకుని ఆర్ఆర్ఆర్ (RRR Movie) ఆదరణ చూరగొంటోంది.
భావోద్వేగాలు, దేశభక్తి రెండూ ఆర్ఆర్ఆర్ లో ఉండడం వల్ల సక్సెస్ అయిందని అంచనా. ఇక సినిమాల పరంగా లిస్టు చూస్తే నాలుగో ప్లేస్ లో బజరంగీ భాయిజాన్ రూ. 969 కోట్లతో నిలిచింది.
ఐదో స్థానంలో సీక్రెట్ సూపర్ స్టార్ రూ. 966 కోట్లతో నిలిచింది. పీకే మూవీ రూ. 854 కోట్లు, బాహుబలి ది బిగినింగ్ రూ. 650 కోట్లతో నిలిచింది.
సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ రూ. 623 కోట్లతో 9వ స్థానంతో సరి పెట్టుకుంది. సంజు మూవీ రూ. 586 కోట్లతో 10వ స్థానంలో నిలిచింది.
Also Read : సెర్బియాలో అల్లు అర్జున్ బర్త్ డే పార్టీ