Dolo 650 Makers Micro Labs : రూ. 1,000 కోట్ల లంచం అబద్దం
ప్రకటించిన డోలో కంపెనీ
Dolo 650 Makers Micro Labs : కరోనా కష్ట కాలంలో డోలో – 650 మందులు(Dolo 650) పెద్ద ఎత్తున ఉపయోగించారు. అయితే డోలో కంపెనీ మహమ్మారి సమయంలో తమ కంపెనీకి చెందిన ట్యాబ్లెట్లను ఉపయోగించేలా సిఫారసు చేయాలంటూ దేశ వ్యాప్తంగా వైద్యులకు లంచం ఇచ్చిందని ఆరోపణలు వచ్చాయి.
ఏకంగా రూ. 1,000 కోట్లకు పైగా చేతులు మారాయంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన సర్వోన్నత న్యాయ స్థానం ఇందుకు సంబంధించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.
డోలో మందుల తయారీ, లంచం ఆరోపణలపై తీవ్రంగా స్పందించింది బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కంపనీ(Dolo 650 Makers Micro Labs). కేంద్ర సర్కార్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడంతో ఈ మేరకు కంపెనీ తన నివేదికను పొందుపర్చింది.
కోర్టుకు సమర్పించింది. ఈ నివేదికలో ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేసింది. వెయ్యి కోట్ల ఆరోపణలన్నీ అబద్దమని, తమ కంపెనీకి ఉన్న పేరును చెడగొట్టేందుకు చేసిన కుట్ర తప్ప మరొకటి కాదని పేర్కొంది.
కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో డోలో మందుల అమ్మకాల ద్వారా కేవలం రూ. 350 కోట్ల వ్యాపారం జరిగిందని స్పష్టం చేసింది. ఈ తరుణంలో తాము ఎలా వైద్యులకు రూ. 1,000 కోట్లు లంచంగా ఇస్తామో ఆరోపణలు చేసిన వారు చెప్పాలని స్పష్టం చేసింది.
ఈ విషయాన్ని సూటిగా ప్రశ్నించారు మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనిషేన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జయరాజ్ గోవిందరాజు.
ఇదిలా ఉండగా కరోనా కష్ట కాలంలో తమ డోలో ట్యాబ్లెట్లకు గిరాకీ పెరిగిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. అయితే డోలో మందులతో పాటు విటమిన్ ట్యాబ్లెట్లు కూడా అమ్మామని తెలిపారు.
Also Read : జిల్లా కోర్టు భవనాన్ని ప్రారంభించిన సీజేఐ