RS Praveen Kumar : ఆర్ఎస్పీ కీల‌క కామెంట్స్

కేసీఆర్ కు బీఎస్పీ చీఫ్ ప‌రామ‌ర్శ

RS Praveen Kumar : హైద‌రాబాద్ – బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఫామ్ హౌస్ లో జారి ప‌డి తుంటి ఎముక ఆప‌రేష‌న్ చేయించుకున్న మాజీ సీఎం , బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ను య‌శోద ఆస్ప‌త్రిలో ప‌రామ‌ర్శించారు ఆర్ఎస్పీ(RS Praveen Kumar). తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌మైన పాత్ర పోషించిన ఆయ‌న అనారోగ్యంతో ఉన్నార‌ని తెలుసుకుని ఇక్క‌డికి వ‌చ్చాన‌ని అందుకే ప‌రామ‌ర్శించ‌డం జ‌రిగింద‌న్నారు.

RS Praveen Kumar Shocking Comments

రాజ‌కీయాలు వేరు, వ్య‌క్తిగ‌త ప‌రామ‌ర్శ‌లు వేరు అని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నిక‌లు ముగిశాయి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ స‌ర్కార్ కూలి పోయింది. ప్ర‌జ‌లు చెంప ఛెళ్లుమ‌నిపించారు. కేవ‌లం 39 సీట్ల‌కే ప‌రిమితం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది.

దీంతో ఊహించ‌ని షాక్ త‌గిలింది కేసీఆర్. ఇక్క‌డ మ‌రోసారి గెలుస్తాన‌ని, ముచ్చ‌ట‌గా మూడోసారి సీఎం అవుతాని క‌ల‌లు క‌న్నారు. వాటిని క‌ల్ల‌లు చేశారు నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జానీకం. ఊహించ‌ని రీతిలో దెబ్బ ప‌డ‌డంతో ఆత్మ ర‌క్ష‌ణ‌లో ప‌డ్డారు బీఆర్ఎస్ బాస్.

త్వ‌ర‌లోనే పార్ల‌మెంట్ ఎన్నిక‌లు రానున్నాయి. ఎలాగైనా స‌రే పోయిన ప‌రువు తిరిగి తెచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు కేసీఆర్. ఈ మేర‌కు దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగారు . ఇక రేవంత్ రెడ్డి సీఎంగా కొలువు తీరాక దూకుడు పెంచారు. అవినీతి అక్ర‌మార్కుల భ‌ర‌తం ప‌డ‌తానంటూ హెచ్చ‌రించారు.

Also Read : Jupally Krishna Rao : మాజీ సీఎం ఆరోగ్యంపై ఆరా

Leave A Reply

Your Email Id will not be published!