RS Praveen Kumar : మోదీ మాట‌లు ప‌చ్చి అబ‌ద్దాలు – ఆర్ఎస్పీ

న‌ల్ల‌ధ‌నం వెలికితీత ఏమైందంటూ ప్ర‌శ్న‌

RS Praveen Kumar : బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ తెలంగాణ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, బీజేసీ సంకీర్ణ స‌ర్కార్ ను ఏకి పారేశారు. 2014లో ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన‌ప్పుడు చేసిన హామీల‌లో ఒక్క‌టి కూడా అమ‌లు చేసిన పాపాన పోలేదంటూ ఆరోపించారు.

దేశంలో అవినీతిని అంతం చేస్తాన‌ని, అక్ర‌మాల‌ను అరిక‌డ‌తాన‌ని , విదేశాల్లో దాచుకున్న న‌ల్ల ధ‌నాన్ని తీసుకు వ‌స్తాన‌ని చెప్పార‌ని కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క పైసా కూడా తీసుకు రాలేక పోయార‌ని ఆరోపించారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్(RS Praveen Kumar). ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో చ‌ర్చించ‌కుండా ,ప్ర‌జ‌ల‌కు చెప్ప‌కుండా ఉన్న‌ప‌ళంగా అర్ధ‌రాత్రి నోట్ల‌ను ర‌ద్దు చేసిన ఘ‌న‌త ప్ర‌ధాని మోదీకే ద‌క్కుతుంద‌ని ఎద్దేవా చేశారు. 

దీని కార‌ణంగా ధ‌న‌వంతులు, వ్యాపార‌వేత్త‌లు, కార్పొరేట్ సంస్థ‌లు ల‌బ్ది పొందాయ‌ని ఇదే స‌మ‌యంలో సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అవినీతి, న‌ల్ల‌ధ‌నం నివారించేందుకు రూ. 500, రూ. 1,000 నోట్ల‌ను ర‌ద్దు చేసిన ప్ర‌ధాన‌మంత్రి కొండ‌ను త‌వ్వి ఎలుక‌ను ప‌ట్టుకున్న‌ట్లుగా ఉంద‌ని మండిప‌డ్డారు. 

నోట్ల ర‌ద్దు వ‌ల్ల పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లకు తీర‌ని న‌ష్టం వాటిల్లింద‌న్నారు. ఇదే స‌మ‌యంలో తీసుకు వ‌చ్చిన రూ. 2,000 నోట్ల‌ను తీసుకు వ‌చ్చిన ప్ర‌భుత్వం దాని వ‌ల్ల అవినీతి మ‌రింత పెరిగింద‌న్నారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. దీని వ‌ల్ల అక్ర‌మార్కుల‌కు ఓ అవ‌కాశంగా , బ‌డా, పారిశ్రామిక‌వేత్త‌ల‌కు మేలు చేకూర్చేలా జ‌రిగింద‌ని వాపోయారు.

అదానీ ఖాతాలో ల‌క్ష‌ల కోట్లు చేరాయ‌ని పేద‌ల ఖాతాల్లో ర‌రూ. 15 ల‌క్ష‌లు ఇప్ప‌టి వ‌ర‌కు జ‌మ కాలేద‌ని , ఎందుక‌ని ప్ర‌శ్నించారు ఆర్ఎస్పీ.

Also Read : దొర పాల‌న‌లో రాష్ట్రం ఆగ‌మాగం

Leave A Reply

Your Email Id will not be published!