Ruchira Kamboj : యుఎన్ శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్
బాధ్యతలు స్వీకరించిన తొలి భారతీయ మహిళ
Ruchira Kamboj : ఎవరీ రుచిరా కాంబోజ్ అనుకుంటున్నారా. భారత దేశానికి చెందిన ఈ ఉన్నతాధికారి చరిత్ర సృష్టించారు. ఐక్యరాజ్య సమితిలో మన దేశం నుంచి శాశ్వత ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు.
ఈ అత్యున్నత పదవిని చేపట్టిన తొలి భారతీయ మహిళగా ఆమె అరుదైన ఘనతను సాధించారు. రుచిరా కాంబోజ్(Ruchira Kamboj) వయస్సు 58 ఏళ్లు.
1987 ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి ఆమె. జూన్ లో న్యూయార్క్ లోని ఐక్య రాజ్య సమితికి భారత దేశం తరపున శాశ్వత ప్రతినిధిగా నియమించింది నరేంద్ర దామోదర దాస్ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం.
ఫారిన్ పాలసీలో మోదీ మోస్ట్ సక్సెస్ ఫుల్ గా నిలిచారు. ఇంతకు ముందు భారత దేశం తరపు నుంచి టిఎస్ తిరుమూర్తి బాధ్యతలు చేపట్టారు.
ఆయన స్థానంలో ప్రస్తుతం రుచిరా కాంబోజ్ ను నియమించింది కేంద్రం. ఇదిలా ఉండగా రుచిరా కాంబోజ్ గతంలో ఐక్య రాజ్య సమితిలో పని చేసిన అనుభవం ఉంది.
ఇక్కడ భారత దేశ శాశ్వత మిషన్ లో కౌన్సెలర్ గా పని చేశారు. అత్యంత సమర్థవంతమైన అధికారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాంతో ఆమె పనితీరుకు దక్కిన గౌరవంగా ఈ పదవిని భావించవచ్చు.
కాగా శాశ్వత ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాయబారి రుచిరా కాంబోజ్(Ruchira Kamboj) యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కు తన ఆధారాలను సమర్పించారు.
బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రుచిరా కాంబోజ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచిన భారత దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా ఉందన్నారు.
Also Read : ఆసియా ధనవంతురాలిగా సావిత్రి జిందాల్