Virat Kohli : ర‌న్ మెషీన్ సెన్సేష‌న్ రికార్డ్

జ‌య‌వ‌ర్ద‌నే రికార్డు బ‌ద్ద‌లు

Virat Kohli : భార‌త స్టార్ క్రికెట‌ర్ , ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు స్వంతం చేసుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హేళ జ‌య‌వ‌ర్దనే పేరు మీద ఉన్న రికార్డును తిర‌గ రాశాడు. ఆస్ట్రేలియా వేదిక‌గా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో అద్భుతంగా ఆడాడు . నాటౌట్ గా నిలిచాడు.

ఇదిలా ఉండ‌గా 2014లో శ్రీ‌లంక స్టార్ ప్లేయ‌ర్ జ‌య‌వ‌ర్ద‌నే పేరు మీద ఉన్న 1016 ప‌రుగుల రికార్డును అధిగ‌మించాడు. పురుషుల టి20 ప్ర‌పంచ క‌ప్ లో

ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ర‌న్ స్కోర‌ర్ గా నిలిచాడు. ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్ కప్ లో స‌గ‌టు రేటు కోహ్లీది 80 కంటే ఎక్కువ‌గా ఉండ‌డం విశేషం.

ఇక స్ట్రైక్ రేట్ 130 కంటే ఎక్కువ‌గా ఉంది. విరాట్ కోహ్లీ(Virat Kohli) బంగ్లాదేశ్ తో మ్యాచ్ సంద‌ర్భంగా తాను ఎదుర్కొన్న 13వ బంతికి ర‌న్స్ చేయ‌డం

ద్వారా మ‌హేల జ‌య‌వ‌ర్ద‌నే పేరుతో ఉన్న రికార్డును తుడిచి వేశాడు. కోహ్లీకి ఇది ఆరో టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కావ‌డం విశేషం. కోహ్లీ త‌న 23వ ఇన్నింగ్స్ లో 12 హాఫ్ సెంచ‌రీల‌తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు.

ఇక జ‌య‌వ‌ర్ద‌నే 31 ఇన్నింగ్స్ ల‌లో ప‌రుగులు చేశాడు. కోహ్లీ 754 బంతులు ఎదుర్కొన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు కోహ్లీ 1017 ప‌రుగులు చేస్తే 84.75 స‌గ‌టుగా

ఉంది. ఇక జ‌య‌వ‌ర్ద‌నే 1016 ర‌న్స్ 39.06 స‌గ‌టు తో ఉండ‌గా క్రిస్ గేట్ 965 ర‌న్స్ 34.46 తో ఉన్నాడు. భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 921 ర‌న్స్ చేయ‌గా కేవలం అత‌డి స‌గ‌టు రేటు 35.42 గా ఉంది.

రోహిత్ శ‌ర్మ‌, మార్టిన్ గ‌ఫ్టిల్ , బాబ‌ర్ ఆజం , పాల్ స్టిర్లింగ్ ల‌ను అధిగ‌మించి టి20ల్లో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు విరాట్ కోహ్లీ.

Also Read : ఐసీసీ టి20 ర్యాంకుల్లో సూర్య భాయ్ టాప్

Leave A Reply

Your Email Id will not be published!