Russia Banned : ఉక్రెయిన్, రష్యా యుద్దం నేపథ్యంలో ప్రపంచం ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. చాలా దేశాలు ఒక వైపు ఉండగా భారత్, చైనా మాత్రం తటస్థ వైఖరిని అనుసరిస్తున్నాయి.
దీంతో రష్యా ఏకపక్ష దాడులను నిరసిస్తూ అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ , తదితర దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీనికి ప్రతీకార చర్యగా రష్యా సైతం నిషేధం (Russia Banned ) విధిస్తూ వస్తోంది. ఇక సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ పై కూడా కన్నెర్ర చేసింది రష్యా.
ఈ మేరకు సంస్థ సిఇఓ మార్క్ జుకర్ బర్గ్ పై రష్యా బ్యాన్ (Russia Banned )విధించింది. తాజాగా అమెరికాకు చెందిన 29 మంది పొలిటికల్ లీడర్లు, కంపెనీల సిఇఓలను బ్లాక్ లిస్టులో పెట్టింది. రష్యా నిషేధిత లిస్టులో మార్క్ జుకర్ బర్గ్ , అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ ఉన్నారు.
వారిపై నిరవధికంగా బ్యాన విధిస్తున్నట్లు తెలిపింది రష్యా. అంతే కాకుండా మైక్రో సాప్ట్ కు చెందిన లింక్డ్ ఇన్ సిఇఓ ర్యాన్ రోస్లాన్స్కీ కూడా ఉండడం విశేషం.
వీరిలో మీడియా ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. రష్యాలోకి ప్రవేశించకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డిఫెన్స్ డిప్యూటీ సెక్రటరీ కాథ్లీన్ హిక్స్ , పెంటగాన్ ప్రతినిధి జాన్ కీర్బీ కూడా ఉన్నారు.
బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ బ్రియాన్ , సిఇఓ కాథీ వార్డెన్ లు కూడా చేర్చింది రష్యా. కామెరాన్ అహ్మద్ , ప్రత్యేక దళాల కమాండర్ స్టీవ్ బోవెన్ కూడా ఉన్నారు. ప్రస్తుతం రష్యా తీసుకున్న నిర్ణయం కలకలం రేపింది.
Also Read : భారత్ తో బంధానికే పాక్ ప్రయారిటీ