Ravil Maganov : రష్యన్ ఆయిల్ చీఫ్ రవిల్ మగనోవ్ మృతి
తీవ్ర అనారోగ్యంతో కన్ను మూసిన రవిల్ మగనోవ్
Ravil Maganov : రష్యా దేశానికి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే మాజీ అధ్యక్షుడు గోర్బచెవ్ మృతి చెందగా తాజాగా దేశ ఆయిల్ రంగానికి ఎనలేని సేవలు అందిస్తూ వచ్చిన రవిల్ మగనోవ్ ప్రమాదవశాత్తు మృతి చెందారు.
ప్రముఖ ఇంధన సంస్థ లుకోయిల్ చైర్మన్ రవిల్ మగనోన్(Ravil Maganov) ఆస్పత్రిలో చికిత్స పొందతూ అనారోగ్యాన్ని తట్టుకోలేక కిటికీ నుంచి పడి ప్రాణాలు విడిచాడు.
ఇదిలా ఉండగా ఉక్రెయిన్ పై రష్యా ప్రభుత్వం దాడి చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో రవిల్ మగనోవ్ ఒకరు. దేశంలోని ప్రధాన కంపెనీలలో లుకోయిల్ కీలకమైన ఆయిల్ కంపెనీగా పేరొందింది.
రష్యా దేశానికి సంబంధించిన చమురు, గ్యాస్ రంగానికి ఎనలేని సేవలు అందించారని కంపెనీ వెల్లడించింది. రష్యా మీడియా కూడా ఆయన మరణాన్ని ధ్రవీకరించాయి.
ఫిబ్రవరిలో మాస్కో దళాలను పాశ్చాత్య అనుకూల దేశానికి పంపడాన్ని రవిల్ మగనోవ్(Ravil Maganov) తీవ్రంగా తప్పు పట్టారు. ఆయిల్ అన్నది ప్రధానమైన వనరుగా ఉంది రష్యాకి.
ఏకపక్షంగా దాడులు చేయడం వల్ల రష్యాకు ఉన్న పేరు పోతుందని ఆవేదన చెందారు. యుద్దం వల్ల నష్టం తప్ప లాభం అనేది ఉండదని, దాని ప్రభావం తాత్కాలికంగా చూపించక పోయినా దీర్ఘ కాలంలో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని హెచ్చరించారు రవిల్ మగనోవ్.
ఆయన అనారోగ్యంతో మృతి చెందారని ప్రకటించడానికి తాము చింతుస్తాన్నమంటూ కంపెనీ పేర్కొంది. ఇదిలా ఉండగా మగనోవ్ 1954లో పుట్టాడు. 1993 నుండి లుకోయిల్ లో పని చేశాడు. కంపెనీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు.
Also Read : బిల్కిస్ దోషుల విడుదల సిగ్గు చేటు