Putin : ప‌శ్చిమ దేశాల‌పై ర‌ష్యా క‌న్నెర్ర‌

యూరోప్ కు గ్యాస్ బంద్ చేస్తాం

Putin  : ఉక్రెయిన్ పై దాడులు ఆపాలంటూ ర‌ష్యాపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. మ‌రో వైపు అమెరికా, బ్రిట‌న్, ఫ్రాన్స్ , యూరోపియ‌న్ కంట్రీస్ అన్నీ గంప గుత్త‌గా ర‌ష్యాపై ఆర్థిక ఆంక్ష‌లు విధించాయి.

త‌మ‌పై ఆర్థిక ఆంక్ష‌లు విధించ‌డం అంటే ఒక ర‌కంగా త‌మ‌పై యుద్దాన్ని ప్ర‌క‌టించిన‌ట్లేనంటూ ర‌ష్యా చీఫ్ పుతిన్ (Putin )స్ప‌ష్టం చేశారు. ఈ త‌రుణంలో ప‌శ్చిమ దేశాల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

ఒక వేళ త‌మ ఇంధ‌న స‌ర‌ఫ‌రాపై బ్యాన్ గ‌నుక విధిస్తే వెంట‌నే తాము యూరోప్ కు గ్యాస్ స‌ర‌ఫ‌రా నిలిపి వేస్తామంటూ స్ప‌ష్టం చేశాడు. ఇందుకు సంబంధించి అధ్య‌క్షుడి పుతిన్ త‌ర‌పున ఆ దేశ డిప్యూటీ ప్ర‌ధాని అలెగ్జాండ‌ర్ నోవాక్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాడు.

ర‌ష్యా గనుక ఆయిల్ పై ఆంక్ష‌లు విధిస్తే ప్ర‌పంచ వ్యాప్తంగా తీవ్ర ప‌రిణామాలు చోటు చేసుకుంటాయ‌ని తెలిపాడు. ఆంక్ష‌ల వ‌ల్ల బ్యారెల్ ఇంధ‌న ధ‌ర 300 డాల‌ర్ల‌కు చేరుతుంద‌ని హెచ్చ‌రించాడు.

అయితే ర‌ష్యాపై మ‌రింత‌గా ఆంక్ష‌లు అమ‌లు చేయాలంటూ అమెరికా ఓ వైపు ఇత‌ర దేశాల‌ను ప్ర‌ధానంగా ప‌శ్చిమ దేశాల‌పై ఒత్తిడి తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా యూరప్ లో వివిధ దేశాల‌కు 40 శాతం గ్యాస్ , 30 శాతం ఇంధ‌నం ర‌ష్యా నుంచే అందుతోంది. దీంతో ఒక వేళ గ‌నుక స‌ర‌ఫరా గ‌నుక ఉన్న‌ప‌ళంగా ఆగిపోతే ఆయా దేశాల ప‌రిస్థితి పూర్తిగా ద‌య‌నీయంగా మార‌నుంది.

ఇదిలా ఉండ‌గా జ‌ర్మ‌నీకి ర‌ష్యా నుంచి గ్యాస్ స‌ర‌ఫ‌రా అవుతోంది.

Also Read : ఒప్పుకుంటే యుద్దం ఆపేస్తాం

Leave A Reply

Your Email Id will not be published!