S Jai Shankar : సిక్కుల‌పై దాడి హ‌క్కుల ఉల్లంఘ‌న కాదా

అమెరికాను ప్ర‌శ్నించిన మంత్రి జై శంక‌ర్

S Jai Shankar : భార‌త దేశంలో మానవ హ‌క్కుల ఉల్లంఘ‌న జ‌ర‌గుతోందంటూ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఇదే విష‌యాన్ని ఆయ‌న అమెరికా టూర్ లో ఉన్న ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , విదేశాంగ శాఖ మంత్రి జై శంక‌ర్(S Jai Shankar) కు స్ప‌ష్టం చేశారు.

ఈ త‌రుణంలో అమెరికాలో ప‌ని చేస్తున్న సిక్కుల‌పై దాడికి పాల్ప‌డ్డారు. దీనిని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు జై శంక‌ర్(S Jai Shankar). ఒక ర‌కంగా చెప్పాలంటే అమెరికాను నిల‌దీశారు. దీనికి మీరు ఏం సమాధానం చెపుతారంటూ ప్ర‌శ్నించారు.

ఒక దేశం ప‌ట్ల ద్వంద్వ ప్ర‌మాణాలు క‌లిగి ఉండ‌రాద‌ని సూచించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. న్యాయం, చ‌ట్టం, ధ‌ర్మం అంద‌రికీ ఒకేలాగా ఉంటుంద‌ని అమెరికాకు ఒక రూల్ ఇండియాకు వేరే చ‌ట్టం అంటూ ఉండ‌ద‌న్నారు.

ప్ర‌తి ఒక్క‌రు బాగుండాల‌ని, శాంతియుతంగా ఉండాల‌ని భార‌త్ కోరుకుంటుంద‌న్నారు జై శంక‌ర్ . భార‌తీయుల‌పై దాడిని ఆయ‌న ఖండించారు. ఇది తెలియక చేసినా తెలిసి చేసినా త‌ప్పేన‌ని స్ప‌ష్టం చేశారు.

తాము దీనిని పూర్తిగా జీర్ణించుకోలేక పోతున్నామ‌ని పేర్కొన్నారు జైశంక‌ర్. ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ భార‌త దేశంలో ఇటీవ‌ల చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌ను పూర్తిగా గ‌మ‌నిస్తున్నామ‌ని తెలిపారు.

ఇందులో మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. మేం కూడా ఇప్పుడు అమెరికాను ప్ర‌శ్నించ‌గ‌ల‌మ‌ని చెప్పారు జై శంక‌ర్.

తాము ఎప్పుడైనా మాట్లాడేందుకు రెడీగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం జై శంక‌ర్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి.

Also Read : అమిత్ షా హిందీ వాదం అన్నామ‌లై ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!