S Jai Shankar : సరిహద్దు వివాదం సంబంధాలపై ప్రభావం
భారత్ చైనా దేశాల బంధంపై జై శంకర్
S Jai Shankar : భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్(S Jai Shankar) సంచలన కామెంట్స్ చేశారు. శాంతికి విఘాతం కలిగితే అది భారత్, చైనా దేశాల మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.
ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం ప్రధాన కారణంగా ఉంటోందన్నారు. బంధం అనేది సాధారణం కాదు, ఉండ కూడదని అభిప్రాయపడ్డారు.
సరిహద్దులో సాధారణ పరిస్థితులు ఏర్పడితే తప్ప సంబంధాలు సాధారంగా ఉండలేవన్నారు. శాంతి, ప్రశాంతతకు చైనా పదే పదే విఘాతం కలిగిస్తూ వస్తోందని ఆరోపించారు జై శంకర్.
బెంగళూరుకు వచ్చిన సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. తాము అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా నడుచుకుంటున్నామని కానీ చైనా తాను తన పరిమితుల్ని దాటుతోందని ఆరోపించారు.
ఇది చైనాకు మంచిది కాదని సూచించారు ఎస్ జై శంకర్. వాస్తవాధీన రేఖ వద్ద నిత్యం గస్తీ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రాదేశిక సమగ్రత, సార్వ భౌమాధికారానికి భంగం కలిగింది.
మూడో దేశం మరో దేశం ఆక్రమించిన సార్వభౌమ భారత భూభాగంలో పనులు చేస్తోందంటూ సంచలన కామెంట్స్ చేశారు చైనాపై. చైనా – పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సిపెక్ ) ప్రాజెక్టులలో మూడు దేశాలు పాల్గొంటున్నాయని తెలిపారు.
అయితే ప్రాదేశిక సమగ్రతను నేరుగా ఉల్లంఘించినట్లు ప్రభుత్వం నివేదికలలో వెల్లడైందని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడారు.
పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన భారత భూభాగంలో ఉన్న ప్రాజెక్టును భారత్ గట్టిగా వ్యతిరేకించిందని స్పష్టం చేశారు.
Also Read : చైనా అడ్డుకోవడం దురదృష్టకరం