SA vs BAN World Cup : డికాక్ జోర్దార్ సఫారీ షాన్ దార్
149 రన్స్ తో బంగ్లాపై విక్టరీ
SA vs BAN World Cup : ముంబై – ఐసీసీ(ICC) వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్ లో దక్షిణాఫ్రికా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. బంగ్లా దేశ్ పై ఏకంగా 149 రన్స్ తేడాతో విక్టరీ నమోదు చేసింది. మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ కు దిగింది సఫారీ టీమ్. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి భారీ స్కోర్ సాధించింది. 382 పరుగులు చేసింది. భారీ టార్గెట్ ఛేదించే క్రమంలో బంగ్లా టీమ్ చేతులెత్తేసింది. సఫారీ బౌలర్ల ధాటికి కుప్ప కూలింది.
SA vs BAN World Cup Updates
విచిత్రం ఏమిటంటే టోర్నీలో అత్యంత బలమైన జట్టుగా ఉన్న సౌతాఫ్రికా టీం ఉన్నట్టుండి పసికూనలుగా పేరు పొందిన నెదర్లాండ్ టీం చేతిలో ఓటమి పాలైంది. దీంతో తన బలం ఏమిటో చూపించింది బంగ్లా జట్టుపై. ఇక టోర్నీలో టాప్ లో కొనసాగుతోంది భారత జట్టు. వరుసగా 5 మ్యాచ్ లలో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో నెంబర్ 1 గా నిలిచింది.
ఇక దాయాది పాకిస్తాన్ జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఆఫ్గనిస్తాన్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. ఇక సఫారీ జట్టు విషయానికి వస్తే డికాక్ దుమ్ము రేపాడు. కేవలం 140 బంతుల్లో ఏకంగా 174 రన్స్ చేశాడు. ఇందులో 15 ఫోర్లు 7 సిక్సర్లు ఉన్నాయి. క్లాసెన్ 49 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 8 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 90 రన్స్ చేశాడు. ఇక డేవిడ్ మిల్లర్ 15 బాల్స్ ఎదుర్కొని 35 రన్స్ చేశాడు. ఇందులో ఒక ఫోర్ 4 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ మార్క్ 60 పరుగులతో రాణించాడు.
అనంతరం భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లా 233 రన్స్ కే ఆలౌటైంది. బంగ్లా దేశ్ జట్టులో సీనియర్ క్రికెటర్ మహ్మదుల్లా అద్భుతంగా రాణించాడు. 11 ఫోర్లు 4 సిక్సర్లతో 111 రన్స్ చేశాడు. అయినా ఫలితం లేకుండా పోయింది.
Also Read : Rani Rudrama Reddy : వేణు ఆశీర్వాదం రాణి సంతోషం