Sabarimala Rush : శబరిమలలో అయ్యప్పల కిటకిట
క్రిక్కిరిసి పోయిన పుణ్య క్షేత్రం
Sabarimala Rush : అయ్యప్ప స్వాములతో కిట కిట లాడుతోంది శబరిమల. దారులన్నీ పుణ్య క్షేత్రం వైపు పరుగులు తీస్తున్నాయి. కిలోమీటర్ల పొడవునా అయ్యప్ప స్వాముల వాహనాలు నిలిచి పోయాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో కేరళ రాష్ట్ర సర్కార్ భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. సంక్రాంతి రోజున ముగుస్తుంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు శబరి మలకు.
Sabarimala Rushwith Devotees
స్వాముల రద్దీ కారణంగా ఎక్కడ చూసినా సందడి నెలకొంది. శబరిమలకు(Sabarimala) ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేస్తున్నారు. భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
భక్తుల రద్దీ కారణంగా ఎక్కడికక్కడ వాహనాలు పెద్ద ఎత్తున నిలిచి పోయాయి. ఈ వాహనాలు 4 కిలోమీటర్లకు పైగా నిలిచి పోయాయి. చివరకు చలి పులి భయ పెడుతోంది. అయినా లెక్క చేయకుండా అయ్యప్ప భక్తులు నడిచి వెళుతున్నారు. శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు.
గంట గంటకు భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో కేరళ సర్కార్ చర్యలు చేపట్టింది. అటవీ దారి సమయాన్ని పెంచింది. ఉదయం నుంచి సాయంత్రం 4.30 గంటలకు పెంచింది. దీంతో అయ్యప్ప భక్తులు నడక మార్గాన్ని ఎంచుకున్నారు.
Also Read : PM Modi Wishes : ఏసు క్రీస్తు జీవితం స్పూర్తి దాయకం