Sachin Pilot : పీఎం చెప్పలేం సర్కార్ ఏర్పాటు ఖాయం
2024 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఢోకా లేదు
Sachin Pilot Plenary : కాంగ్రెస్ యువ నాయకుడు , మాజీ రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్(Sachin Pilot Plenary) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ లో ప్రారంభమైన 85వ ప్లీనరీ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ మీడియాతో మాట్లాడారు.
తమ పార్టీ పవర్ లోకి రావడం ఖాయమన్నారు. కానీ రాహుల్ గాంధీ అవుతారా లేక ఇంకొకరు అవుతారా అనేది తాను చెప్పలేనని అన్నారు. ఈ విషయం మూడు రోజుల పాటు ప్లీనరీ జరిగాక పార్టీ నిర్ణయాత్మక కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.
ఇందులో తన అభిప్రాయం చెప్పేందుకు వీలు కుదరదన్నారు. ఇక ఇంకెంత కాలం మతం పేరుతో విద్వేష రాజకీయాలు సృష్టిస్తారంటూ ప్రశ్నించారు. సచిన్ పైలట్ బీజేపీని ఏకి పారేశారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని స్పష్టం చేశారు.
ప్లీనరీ ముగిశాక పార్టీ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా ప్రజలు పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని కాంగ్రెస్ పట్ల, కూటమి పట్ల పూర్త సానుకూలతతో ఉన్నారని చెప్పారు సచిన్ పైలట్. దేశంలో ప్రస్తుతం రాచరిక పాలన సాగుతోందన్నారు. ఎక్కడ చూసినా అవినీతి తప్ప ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు సచిన్ పైలట్.
Also Read : కొలువుల కల్పనలో కేంద్రం ఫెయిల్