Sachin Pilot : యువ నాయకత్వంపై కాంగ్రెస్ ఫోకస్
స్పష్టం చేసిన సీనియర్ లీడర్ సచిన్ పైలట్
Sachin Pilot : కాంగ్రెస్ పార్టీ యువ నాయకత్వంపై ఎక్కువగా ఫోకస్ పెట్టనుంది. దేశ వ్యాప్తంగా రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ బలోపేతంపై రోడ్ మ్యాప్ గురించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో నవ సంకల్ప్ చింతన్ శివిర్ ప్రారంభమైంది. ఇవాళ రెండో రోజు. మొదటి రోజు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ దిశా నిర్దేశం చేశారు పార్టీ శ్రేణులకు. ఆమె ప్రధాని మోదీని టార్గెట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తోందంటూ ఆరోపించారు. ఇక ఆర్థిక ప్యానెల్ కు చీఫ్ గా ఉన్న కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మోదీ పాలన గాడి తప్పిందని, ఆర్థిక వ్యవస్థ దారుణంగా తయారైందని ఆవేదన చెందారు. ఇలాగే పాలన సాగిస్తూ పోతే ఏదో ఒకరోజు భారత దేశం కూడా మరో ద్వీప దేశం శ్రీలంక గా మారడం ఖాయమన్నారు.
అసంబద్ద , అస్పష్టమైన నిర్ణయాలు దేశానికి తలనొప్పిగా మారాయన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. ప్రధానంగా యువతపై ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సి న అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సచిన్ పైలట్(Sachin Pilot).
పార్టీకి యువ నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి మార్గం సుగమం చేస్తే భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లే చాన్స ఉందన్నారు పైలట్(Sachin Pilot).
కాంగ్రెస్ లో యువకులకు ప్రయారిటీ ఉంటుందన్నారు. మూడు రోజుల సదస్సు ముగిశాక బ్లూ ప్రింట్, రోడ్ మ్యాప్ డిక్లేర్ చేస్తారని ప్రకటించారు.
Also Read : త్రిపుర సీఎం బిప్లబ్ దేబ్ రాజీనామా