Sachin Tendulkar : ఆ నాలుగు జట్లకు గెలిచే ఛాన్స్
సచిన్ రమేష్ టెండూల్కర్
Sachin Tendulkar : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఐసీసీ వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్ సచిన్ రమేష్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అక్టోబర్ 5న అంగరంగ వైభవంగా ప్రపంచ కప్ 2023 ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏ జట్లకు కప్ గెలిచే ఛాన్స్ ఉందనే దానిపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
Sachin Tendulkar Comments Viral
దాయాది పాకిస్తాన్ కు అంత సీన్ లేదన్నారు. తన దృష్టిలో ఆ నాలుగు జట్లు సెమీస్ కు చేరుకుంటాయని చెప్పారు. ఆ జట్లలో టీమిండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ , ఇంగ్లండ్ జట్లకు ఎక్కువగా వరల్డ్ కప్ ను చేజిక్కించుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపాడు.
భారత జట్టు ఎంపిక సమతుల్యంగా ఉందని, ఇక ఇంగ్లండ్ ను తక్కువగా అంచనా వేసేందుకు వీలు లేదన్నాడు. ఆస్ట్రేలియా జట్టు పటిష్టంగా ఉండడంతో ఆ జట్టుకు సైతం వరల్డ్ కప్ ను ఎగురేసుకు పోయేందుకు ఛాన్స్ లేక పోలేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
న్యూజిలాండ్ ఏ సమయంలోనైనా సత్తా చాటేందుకు రెడీగా ఉంటుందని, ఆ జట్టును తక్కువగా అంచనా వేసేందుకు వీలు లేదన్నాడు. అటాకింగ్ లో అన్ని జట్ల కంటే భిన్నంగా ఆడుతుందని పేర్కొన్నాడు సచిన్ రమేష్ టెండూల్కర్(Sachin Tendulkar). ఇక భారత జట్టు తాజాగా ఆసియా కప్ గెలిచిందని, అదే ఊపుతో వరల్డ్ కప్ గెలిచినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదన్నాడు.
Also Read : Ambati Ram Babu : వాళ్లు పొలిటికల్ బఫూన్స్