Sachin Tendulkar : స‌చిన్ ఐపీఎల్ బెస్ట్ టీంలో ధావ‌న్

బుమ్రాకు చోటు క‌ల్పించిన స్టార్

Sachin Tendulkar : ఐపీఎల్ 2022 ముగిసింది. పాండ్యా సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్ టైటిల్ గెలిచింది. ఐపీఎల్ లో అత్యుత్త‌మ జ‌ట్టును ఎంపిక చేశాడు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ స‌చిన్ ర‌మేష్ టెండూల్క‌ర్. ఈ టీంలో శిఖ‌ర్ ధావ‌న్, జ‌స్ప్రీత్ బుమ్రాకు ఛాన్స్ ఇచ్చాడు.

ఇప్ప‌టికే ఇర్ఫాన్ ప‌ఠాన్, త‌దిత‌ర ఆట‌గాళ్లు ఐపీఎల్ లో అత్యుత్త‌మ ఆట‌గాళ్లు ఎవ‌ర‌నే దానిపై త‌మ అభిప్రాయాలు చెబుతున్నారు. మ‌రికొంద‌రు త‌మ క‌ల‌ల జ‌ట్ల‌ను ప్ర‌క‌టిస్తున్నారు.

తాజాగా స‌చిన్ టెండూల్క‌ర్(Sachin Tendulkar) కూడా ఇదే చేశాడు. టాప్ లో మంచి లెఫ్ట్ , రైట్ కాంబినేష‌న్ ను కొన‌సాగించేందుకు తాను ధావ‌న్ ను ఎంచుకున్న‌ట్లు టెండూల్క‌ర్ వెల్లడించాడు.

ఇదిలా ఉండ‌గా గ‌తంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు ఆడిన శిఖ‌ర్ ఈసారి ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జ‌ట్టు త‌ర‌పున ఆడాడు. మొత్తం 14 మ్యాచ్ లు ఆడిన శిఖ‌ర్ ధావ‌న్ 460 ప‌రుగులు చేశాడు. టెండూల్క‌ర్ త‌న స్వంత ఛాన‌ల్ లో ఈ మేర‌కు త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాడు.

శిఖ‌ర్ అయితే ఓపెన‌ర్ గా సెలెక్ట్ చేశాన‌ని తెలిపాడు. ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వ‌స్తున్న ప్లేయ‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా. ఈసారి రిచ్ లీగ్ లో 14 మ్యాచ్ లు ఆడి 15 వికెట్లు తీశాడు.

బుమ్రాను ప్ర‌పంచంలోనే బెస్ట్ డెత్ బౌల‌ర్ గా కితాబు ఇచ్చాడు. ఇక టెండూల్క‌ర్(Sachin Tendulkar) ఎంపిక చేసిన జ‌ట్టు ఇలా ఉంది.

శిఖ‌ర్ ధావ‌న్ , జోస్ బ‌ట్ల‌ర్ , కేఎల్ రాహుల్ , హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్ల‌ర్ , లివింగ్ స్టోన్ , దినేష్ కార్తీక్ , ర‌షీద్ ఖాన్ , మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ, బుమ్రా , యుజ్వేంద్ర చాహ‌ల్ ఉన్నారు.

 

Also Read : ఐపీఎల్ ఉత్త‌మ జ‌ట్టుకు అత‌డే కెప్టెన్

 

Leave A Reply

Your Email Id will not be published!