Sachin Tendulkar : నేష‌న‌ల్ ఐకాన్ గా స‌చిన్ – ఈసీ

ఎంపిక చేసిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం

Sachin Tendulkar : కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌ముఖ భార‌తీయ మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ ను నేష‌న‌ల్ ఐకాన్ గా ఎంపిక చేసిన‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు బుధ‌వారం వెల్ల‌డించింది. త్వ‌ర‌లో వ‌చ్చే ఏడాది 2024లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ సంద‌ర్భంగా దేశ వ్యాప్తంగా ఓటు హ‌క్కు ఉప‌యోగించు కోవాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో ప్ర‌జ‌లు విస్తృతంగా పాల్గొనాల‌ని, ఓటు అనేది వ‌జ్రాయుధం అని పేర్కొంది ఈసీ.

Sachin Tendulkar As a Advertiser of Vote

ఇందుకు సంబంధించి మ‌రింత ప్రోత్సాహం అందించేలా స‌చిన్ టెండుల్క‌ర్(Sachin Tendulkar) ను ఎంపిక చేయాల్సి వ‌చ్చింద‌ని ఈసీ స్ప‌ష్టం చేసింది. ఓటును ప్రోత్స‌హించేందుకు గాను మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది.

ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం , స‌చిన్ టెండూల్క‌ర్ మ‌ధ్య అవ‌గాహ‌న ఒప్పందం కూడా కుదిరింది. మూడేళ్ల పాటు ఈ ఒప్పందం అమ‌లులో ఉంటుంది. ఇందులో భాగంగా ఓట‌ర్ల‌లో చైత‌న్యం తీసుకు వ‌చ్చేందుకు , ప్ర‌తి ఒక్క‌రూ ఓటు వేయాల‌ని ప్ర‌చారం చేస్తారు స‌చిన్ టెండూల్క‌ర్. యువ‌త‌ను ఎక్కువ‌గా ఓటు వేసేలా చేస్తార‌ని అంచ‌నా వేస్తోంది ఈసీ.

Also Read : Satyavathi Rathod : నాగ జ్యోతికి స‌త్య‌వ‌తి న‌జ‌రానా

Leave A Reply

Your Email Id will not be published!