Sachin Tendulkar : మోదీకి నమో జెర్సీ బహూకరణ
అందజేసిన సచిన్ టెండూల్కర్
Sachin Tendulkar : భారత క్రికెట్ జట్టు మాజీ స్కిప్పర్ సచిన్ టెండూల్కర్ హాట్ టాపిక్ గా మారారు. నమో భారత్ జెర్సీని శనివారం ప్రత్యేకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బహూకరించారు. వారణాసిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు పీఎం.
ట్విట్టర్ వేదికగా అరుదైన ఫోటోను పంచుకున్నారు. నరేంద్ర మోదీకి జెర్సీ బహూకరించిన సమయంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి కూడా ఉన్నారు. ఈ క్షణాన్ని తాను మరిచి పోలేనని పేర్కొన్నారు సచిన్ టెండూల్కర్.
Sachin Tendulkar Presented Namo Jersey
ఈ వారణాసి స్టేడియం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో భారత క్రికెట్ జట్టుకు చెందిన మాజీ క్రికెటర్లు సచిన్ రమేష్ టెండూల్కర్ తో పాటు , రవి శాస్త్రి, సునీల్ గవాస్కర్ , దిలీప్ వెంగ్ సర్కార్ కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెంట ఉన్నారు.
విచిత్రం ఏమిటంటే సచిన్(Sachin Tendulkar ) బహూకరించిన జెర్సీపై నమో భారత్ అని రాసి ఉండడం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. మోదీ, సచిన్ , యోగి ఆదిత్యానాథ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఈ సందర్బానికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు సచిన్ రమేష్ టెండూల్కర్. యూపీలోని వారణాసిలో స్టేడియం నిర్మాణానికి శంకు స్థాపన చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేశారు.
Also Read : Chandra Babu Naidu : సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్