Saba Karim : స‌ఫారీ టూర్ ద్ర‌విడ్ కు పెను స‌వాల్

బీసీసీఐ మాజీ సెలెక్ట‌ర్ స‌బా క‌రీమ్

Saba Karim  : రెండో టెస్టులో భార‌త్ పై సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించ‌డంతో ప్ర‌ధానంగా భార‌త టెస్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే హెడ్ కోచ్ గా ఉన్న ది వాల్ రాహుల్ ద్ర‌విడ్ కు అగ్ని ప‌రీక్ష‌గా మార‌నుంది.

ఇదే విష‌యాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు భార‌తీయ క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి – బీసీసీఐ మాజీ సెలెక్ట‌ర్ స‌బా క‌రీమ్(Saba Karim) . స‌ఫారీ టీమ్ కెప్టెన్ గా ఉన్న డీన్ ఎల్గ‌ర్ అద్భుతంగా ఆడాడ‌ని కితాబు ఇచ్చాడు.

ఫ‌స్ట్ టెస్టులో టీమిండియా గెలుపొంద‌గా రెండో టెస్టులో స‌ఫారీ దుమ్ము రేపింది. మూడు టెస్టుల సీరీస్ లో ఇరు జ‌ట్లూ చెరో మ్యాచ్ విజ‌యం సాధించాయి.

స్వ‌దేశంలో సెంచూరియ‌న్ వేదిక‌గా గెలుపొంది చ‌రిత్ర సృష్టించి భార‌త జ‌ట్టు. రెండో టెస్టులో హైద‌రాబాదీ స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ గాయం కావ‌డంతో అత‌డు లేని లోటు క‌నిపించింద‌న్నాడు స‌బా క‌రీమ్.

స్వ‌దేశంలో వంద శాతం ప‌ర్ ఫార్మెన్స్ చూపించే సౌతాఫ్రికా జ‌ట్టును త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌న్నాడు. దీంతో ప్రాక్టీస్ సెష‌న్ లో తీవ్రంగా క‌ష్ట‌పడాల్సి ఉంటుంద‌ని సూచించాడు. ప్ర‌ధానంగా హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ముందు పెను స‌వాల్ గా మారింది.

ఇదిలా ఉండ‌గా ఈనెల 11న మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ త‌రుణంలో ప‌రువు పోకుండా కాపాడు కోవాలంటే చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంద‌న్నారు స‌బా క‌రీమ్.

జోష్ మీదున్న స‌ఫారీ టీమ్ ను ఢీకొనాలంటే త‌ప్ప‌నిస‌రిగా తీవ్రంగా ఫోక‌స్ పెట్టాల‌ని సూచించాడు. అంతే కాదు క‌నీసం ఓడి పోకుండా డ్రా చేసుకోవాల‌న్నా శ్ర‌మించాల‌న్నాడు.

Also Read : రిష‌బ్ పంత్ కు మంజ్రేక‌ర్ మ‌ద్ద‌తు

Leave A Reply

Your Email Id will not be published!