Madan Lal : సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకున్న రిషబ్ పంత్ పై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. రెండో ఇన్నింగ్స్ లో మనోడు బాధ్యతగా ఆడాల్సిన విషయాన్ని పట్టించు కోకుండా అత్యంత నిర్లక్ష్యంగా ఆడటాన్ని తప్పు పడుతున్నారు భారత మాజీ క్రికెటర్లు.
ఇంకో వైపు రిషబ్ పంత్ ను తప్పించి ఆల్ రెడీ జట్టులో స్టాండ్ బై గా ఉన్న వృద్ధి మాన్ సాహాను ఎందుకు కొనసాగించడం లేదంటూ భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ను తప్పు పడుతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ (Madan Lal)సీరియస్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రిషబ్ పంత్ కంటే సాహా బెటర్ అని పేర్కొన్నాడు.
పంత్ అద్భుతమైన ఆటగాడు అని కానీ కీలకమైన సమయంలో వికెట్ పారేసు కోవడం దారుణమన్నాడు. ఇంత బాధ్యతా రాహిత్యంతో ఎలా ఆడతాడంటూ మండిపడ్డాడు మదన్ లాల్.
టెస్టు క్రికెట్ వేరు ఐపీఎల్, వన్డే , టీ 20 ఫార్మాట్ వేరుగా ఉంటుందన్న విషయం ముందు రిషబ్ పంత్ తెలుసు కోవాలని అన్నాడు. ఒక్కో ఫార్మాట్ కు ఒక్కోలా ఆడాలని సూచించాడు మదన్ లాల్.
కేప్ టౌన్ లో జరిగే మూడో టెస్టులో రిషబ్ పంత్ ను తీసేసి వృద్ది మాన్ సాహాను ఆడించాలని కోరాడు. అంతే కాదు పంత్ కంటే సాహానే తెలివైన ఆటగాడంటూ మదన్ లాల్ ప్రశంసలతో ముంచెత్తాడు.
రాహుల్ ద్రవిడ్ ఈ విషయంలో మరోసారి ఆలోచించాలని సూచించాడు.
Also Read : మూడో టెస్టుకు పంత్ అనుమానమే