Sahiti Infra MD Arrest : కోట్లు కొల్లగొట్టిన టీటీడీ బోర్డు మెంబర్
భారీ మోసం బూదాటి లక్ష్మీనారాయణ అరెస్ట్
Sahiti Infra MD Arrest : ఎవరీ బూదాటి లక్ష్మీనారాయణ అనుకుంటున్నారా. రియల్ ఎస్టేట్ దందా చేస్తూ , సర్కార్ కు వంత పాడుతూ ఏకంగా కోట్లు కొల్లగొట్టాడు. ఆపై అందమైన వెంచర్లు, బ్రోచర్లతో బురిడీ కొట్టించాడు. ప్రీ లాంచ్ పేరుతో ఫ్లాట్లు ఇస్తామని ఆశ చూపించాడు. ఆపై చేతులు ఎత్తేశాడు.
తమ డబ్బులు కావాలని అడిగితే బెదిరింపులకు దిగాడు. ఆయన సాహితీ ఇన్ ఫ్రా టెక్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్(Sahiti Infra MD) గా ఉన్నారు. భారీ ఎత్తున మోసానికి పాల్పడినట్లు తేలడంతో బూదాటి లక్ష్మీ నారాయణను అరెస్ట్ చేశారు. దీంతో మనోడి నిర్వాకం బట్టబయలు అయ్యింది.
అరెస్ట్ నేపథ్యంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖ పంపారు. ఆయన కొద్ది కాలం నుంచీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ఒకటి కాదు వంద కాదు ఏకంగా రూ. 900 కోట్లు వసూలు చేశారు బూదాటి. 2,500 మందికి పైగా మోస పోయారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి.
ఈ విషయాన్ని హైదరాబాద్ ఏసీపీ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. బాధితుల ఆందోళన మేరకు విచారణ చేపట్టామన్నారు. గతంలో పలు కేసులు నమోదు అయినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా నగర శివారులోని అమీన్ పూర్ గ్రామంలో సాహితీ శ్రావణి ఎలైట్ పేరుతో 23 ఎకరాల్లో 38 అంతస్తులతో అపార్ట్ మెంట్స్ నిర్మిస్తున్నట్లు లక్ష్మీనారాయణ ప్రకటించారు.
వీటికి ముందస్తుగా ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. 1,200 నుంచి 1,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో డబుల్, ట్రిబుల్ ఫ్లాట్స్ ఉన్నట్లు నమ్మించాడు. ఈ దొంగకు రాష్ట్ర సర్కార్ నుంచి సపోర్ట్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read : లిక్కర్ స్కాంలో కవితకు నోటీసులు