Sai Sudarshan : ‘త‌మిళ తంబి’ జోర్దార్ ఇన్నింగ్స్

రాణించిన సాయి సుద‌ర్శ‌న్

Sai Sudarshan : హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్ ఐపీఎల్ లో రెండో ఓట‌మి చవి చూసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన మ్యాచ్ ల‌లో అత్య‌ధిక విజ‌యాలు సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ వ‌న్ లో నిలిచింది.

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ , పంజాబ్ కింగ్స్ తో మాత్ర‌మే ఆ జ‌ట్టు ఓడి పోయింది.

ఈ త‌రుణంలో ఓ వైపు పంజాబ్ కింగ్స్ బౌల‌ర్ల దెబ్బ‌కు గుజ‌రాత్ బ్యాట‌ర్లు ప‌రుగులు చేసేందుకు నానా తంటాలు ప‌డ్డారు.

కానీ ఒకే ఒక్క‌డు త‌మిళ తంబి సాయి సుద‌ర్శ‌న్ మాత్రం దుమ్ము రేపాడు. త‌న బ్యాటింగ్ తో స‌త్తా చాటాడు.

కేవ‌లం 50 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సుద‌ర్శ‌న్ (Sai Sudarshan)5 ఫోర్లు ఓ సిక్స‌ర్ కొట్టాడు.

మొత్తం 65 ప‌రుగులు చేసి కీల‌క పాత్ర పోషించాడు గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు స్కోర్ లో.

ఓ వైపు సౌతాఫ్రికా క్రికెట‌ర్ , స్టార్ పేస‌ర్ క‌గిసొ ర‌బ‌డ అద్భుత‌మైన బౌలింగ్ తో ఆక‌ట్టుకున్నాడు.

4 ఓవ‌ర్లు వేసి 33 ప‌రుగులు ఇచ్చి కీల‌క‌మైన 4 వికెట్లు తీశాడు. స‌త్తా చాటాడు. ఇదిలా ఉండ‌గా ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా ఇంకో వైపు మొక్కవోని ఆత్మ స్థైర్యంతో క‌ళ్లు చెదిరేలా షాట్స్ కొట్టాడు.

ఎక్క‌డా తొట్రుపాటుకు గురి కాలేదు సాయి సుద‌ర్శ‌న్. ఇత‌డి పూర్తి పేరు భ‌ర‌ద్వాజ్ సాయి సుద‌ర్శ‌న్(Sai Sudarshan) . 15 అక్టోబ‌ర్ 2001లో త‌మిళ‌నాడులోని చెన్నైలో పుట్టాడు.

అత‌డి వ‌య‌సు 20 ఏళ్లు. ఐపీఎల్ లో ఆడ‌క ముందు త‌మిళ‌నాడు ప్రీమియ‌ర్ లీగ్ లో ఆడాడు. త‌మిళ‌నాడు జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు.

2021-22లో స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో త‌మిళ‌నాడు జ‌ట్టు త‌ర‌పున ఆడాడు. విజ‌య్ హ‌జారే ట్రోఫీలో కూడా ఆడాడు. ఇక ఫిబ్ర‌వ‌రి 12, 13 ల‌లో జ‌రిగిన మెగా వేలం పాట‌లో గుజ‌రాత్ టైటాన్స్ యాజ‌మాన్యం సాయి సుద‌ర్శ‌న్ ను చేజిక్కించుకుంది.

Also Read : పంజాబ్ భ‌ళా గుజ‌రాత్ విల విల

Leave A Reply

Your Email Id will not be published!